మంచి ప‌ని చేసి బాబు ఆగ్ర‌హానికి గురైన ఎంపీ... రీజ‌న్ ఇదే     2018-04-18   23:30:03  IST  Bhanu C

టీడీపీలో ఏం జ‌రిగినా పార్టీ అధినేత, సీఎం చంద్ర‌బాబుకు తెలిసే జ‌ర‌గాలి. టీడీపీలో ఎవ‌రు ఎలాంటి స్టెప్ వేసినా.. చంద్ర‌బాబుకు తెలిసే జ‌ర‌గాలి. అలాకాద‌ని ఎవ‌రైనా దూకుడు ప్ర‌ద‌ర్శించాల‌ని చూస్తే.. ఇదిగో ఇప్పుడు ఎంపీ కె. రామ్మో హ‌న్ నాయుడుకు జ‌రిగిన‌ట్టే జ‌రుగుతుంది. విష‌యంలోకి వెళ్తే.. సీనియ‌ర్ కాంగ్రెస్ నేత‌, దివంగత కింజ‌రాపు ఎర్ర‌న్నా యుడు కుమారుడు కింజ‌రాపు రామ్మోహ‌న్‌నాయుడు 2014లో శ్రీకాకుళం ఎంపీగా లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. తండ్రి వార‌స‌త్వంగా వ‌చ్చిన రాజ‌కీయాల‌ను ఆయ‌న కూడా కొన‌సాగిస్తున్నారు.

లోక్‌స‌భ‌లో ప‌లు ప్ర‌శ్న‌లు సంధించ‌డం ద్వారా మీడియా దృష్టిని సైతం ఆక‌ర్షించాడు. ఇక‌, ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్రం చేస్తున్న తొండిని ఎండ‌గ‌ట్ట‌డంలో రామ్మోహ‌న్ నాయుడు స‌క్సెస్ అయ్యారు. ప్ర‌త్యేక హోదా కోరుతూ పార్ల‌మెంటులో టీడీపీ ఎంపీలు చేసిన ఆందోళ‌న‌లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించాడు. ప్ర‌ధాని ఇంటి ముందు చేసిన ధ‌ర్నా విష‌యంలోనూ ఆయ‌న కీల‌కంగానే ఉన్నారు. పోలీసులు అరెస్టు చేసిన స‌మ‌యంలో ఏపీకి అన్యాయం చేస్తున్న ప్ర‌ధాని మోడీకి త‌గిన గుణ‌పాఠం చెబుతారంటూ శాప‌నార్థాలు కూడా పెట్టారు.