కేసీఆర్ బాటలో బాబు ... ముందుగానే అభ్యర్థుల ప్రకటన ..     2018-08-18   12:28:25  IST  Sai M

తెలుగుదేశం పార్టీలో ఎప్పుడూ ఒక సంప్రదాయం ఉంది. అదే సంప్రదాయాన్ని ఇప్పటివరకు పాటిస్తూ వచ్చారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆ సంప్రదాయాన్ని పక్కనపెట్టి ముందుకు వెళ్లాలని టీడీపీ చూస్తోంది. ఇంతకీ అదేంటంటే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల గురించి. అన్ని పార్టీలు ముందుగానే అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధం అవుతుండంతో బాబు ఈ విధంగా నిర్నయం తీసుకున్నాడు.

Chandrababu Naidu,Chandrababu Naidu Wants To Follow To KCR,KCR,TDP,telangana Politics,TRS

అదీ కాకుండా పక్కనే ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ వచ్చే నెలలో అభ్యర్థుల లిస్ట్ మొత్తం ప్రకటించబోతున్నాడు. ముందుగా ఇలా ప్రకటన చేయడం వలన కలిసొచ్చే అంశాలు ఏంటో అనే విషయాన్ని రకరకాలుగా పరిశీలించి ఆ తరువాత కేసీఆర్ ఆ నిర్నయాయం తీసుకున్నాడు. దీంతో బాబు కూడా ఆ విధంగా చేస్తేనే బాగుంటుందని పార్టీ నాయకుల దగ్గర కూడా తన మనసులో మాట చెప్పాడట.

ముందుగా ఓ 40 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తోంది. వీటిల్లో కూడా ఎక్కువ వైసిపి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలే ఉన్నాయట. తాజాగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఒక విధంగా ప్రయోగమనే చెప్పాలి. ఇంతకీ ఆ ప్రయోగం ఎందుకు ? ఎందుకంటే, వైసిపి ఎమ్యెల్యేలను వచ్చే ఎన్నికల్లో ధీటుగా ఎదుర్కోవాలంటే ఇదే సరైన దారని బాబు ఆలోచన. ప్రస్తుతం వైసిపి ఎమ్యెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో దాదాపు వాళ్లకే టిక్కెట్లు వచ్చే అవకాశాలున్నాయి. అందుకనే టిడిపి నుండి పోటీ చేసే అభ్యర్ధులను కూడా ముందుగానే ప్రకటిస్తే ఆశించిన ఫలితాలు వస్తాయని బాబు ఆలోచన.

Chandrababu Naidu,Chandrababu Naidu Wants To Follow To KCR,KCR,TDP,telangana Politics,TRS

వాస్తవంగా లెక్కేసుకుంటే టీడీపీ లో ఇదో కొత్త సంప్రదాయం అనే చెప్పాలి. టిడిపిలో ముందుగా టిక్కెట్లు ప్రకటించే అవకాశం లేదు. చివరి నిముషంలో కానీ చంద్రబాబు ఎవరికీ టిక్కెట్లను ప్రకటించరన్న విషయం అందరికీ తెలిసిందే. దానివల్ల చాలా నియోజకవర్గాల్లో నేతలు టెన్షన్ పెరిగిపోతుంటుంది. చివరి నిముషంలో టిక్కెట్లను ప్రకటించటంతో అభ్యర్ధులు ఇబ్బందులు ఎదుర్కొన్న సంఘటనలు అనేకం ఉన్నాయి. వచ్చే ఎన్నికలు చంద్రబాబుకు అత్యంత ప్రతిష్టాత్మకం. కాబట్టి అభ్యర్ధులను ముందుగా ప్రకటిస్తే ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయని బాబు ఈ విధానానికి ఒకే చెప్పినట్టు తెలుస్తోంది.