బాబు గారి చూపు వారి పై పడిందా..ఎందుకో...  

టీడీపీలో ఉప్పుడు ఉన్న నాయకులు సరిపోవడంలేదు ఏమో కానీ కొత్త నేతలను సైకిల్ ఎక్కించుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెగ ఆరాటపడిపోతున్నట్టు కనిపిస్తోంది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో వివిధ పార్టీల్లో ఉన్న బలమైన నేతలపై దృష్టిసారించాడు బాబు. రాబోయే ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉండబోతోంది, అదీ కాకుండా … ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్యెల్యేలపై ప్రజల నుంచి వ్యతిరేకత ఉన్న దృష్ట్యా కొంతమంది వలస నేతలకు అవకాశం ఇచ్చి ఎన్నికల్లో సైకిల్ స్పీడ్ కి అడ్డు లేకుండా చేసుకోవాలని బాబు చూస్తున్నాడు.

ఏపీ కాంగ్రెస్ లో ఒక వెలుగు వెలిగి ఇప్పుడు రాజకీయ ఉనికి కోసం ఆరాటపడుతున్న కొంతమంది బలమైన నాయకులపై దృష్టిపెట్టిన బాబు వారికి పిలిచి మరీ తన అపాయింట్మెంట్ ఇస్తున్నాడు. కొద్ధి రోజుల క్రితం కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను పిలిపించుకుని చాల సమయం అఃడితో మంతనాలు చేసాడు. అప్పటి నుంచి చంద్రబాబు పేరు చెప్తే చాలు ఒంటి కాలిపై లేచే ఆయన మెత్తబడిపోయాడు. వారి ఇద్దరి భేటీ సందర్భంగా టీడీపీలోకి రావాల్సిందిగా ఉండవల్లికి బాబు ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

అదే కోవలో అనంతపురం జిల్లాకు చెందిన కాంగ్రెస్ మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ను తన దగ్గరకు పిలిపించుకుని మరీ మంతనాలు చేసాడు బాబు. వీరు ఇద్దరే కాకుండా కాంగ్రెస్ లో ఉంది సరైన రాజకీయ అవకాశం లేకుండా ఉన్న బలమైన నాయకులకు సంభందించి ఇప్పకే ఒక లిస్ట్ తయారు చేసుకున్నట్టు తెలుస్తోంది దాని ప్రకారమే వారిని ఒక్కొక్కరిని పిలిచి పార్టీ లోకి రావాల్సిందిగా బాబు మంతనాలు చేస్తున్నాడు. మాములుగా అయితే బాబు తన దగ్గరకు పిలిచి పార్టీలో చేరమని అడగడు ఎవరో ఒకరికి ఈ బాధ్యత అప్పగించేవాడు. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా బాబు స్వయంగా రంగంలోకి పరిస్థితి చక్కబెట్టుకుంటున్నాడు.