ఎయిర్ ఏషియా కుంభకోణంలో ఏపీ సీఎం..? బుక్కయినట్టేనా ...?     2018-06-05   01:19:25  IST  Bhanu C

ఇప్పటికే ఓటుకు నోటు కేసులో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కి మరో కేసు పీకకు చుట్టుకుంది. అయితే ఇప్పుడు కేంద్రం నుంచి సహకారం లేకపోవడం… ఏ కేసులో బాబు దొరుకుతాడా అని కేంద్రం డేగ కళ్ళతో చూస్తుండడంతో ఇక చంద్రబాబు ఇరుక్కున్నట్టే అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే.. నిబంధనలకు విరుద్ధంగా అంతర్జాతీయ ఫ్లయింగ్‌ లైసెన్స్‌ను తీసుకున్నారనే ఆరోపణల కింద ఎయిర్‌ ఏషియా గ్రూప్‌ సీఈఓ టోనీ ఫెర్నాండెజ్‌పై కొద్దిరోజుల క్రితం సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి ముంబై, ఢిల్లీ, బెంగళూరులోని ఆరు కేంద్రాలో సీబీఐ దాడులు నిర్వహిస్తోంది. అంతర్జాతీయ లైసెన్స్‌లు పొందే విషయంలో 5/20 నిబంధలను కంపెనీ ఉల్లంఘించినట్లు సీబీఐ ఆరోపించింది.

ఎయిర్‌ ఏషియా ఇండియాకు విదేశీ సర్వీసులు నడపడానికి గాను ఈ నిబంధనను మార్చాలని తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చింది. కానీ దీన్ని స్పైస్‌ జెట్, జెట్‌ ఎయిర్‌వేస్‌ వంటి స్థానిక విమానయాన కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అయినా జూన్, 2016లో 5/20 నిబంధనను సవరిస్తూ అప్పటి పౌరవిమాన యాన శాఖ మంత్రి అశోక గజపతి రాజు నిర్ణయం తీసుకున్నారు. ఈ సవరణ ప్రకారం ఐదేళ్ల సర్వీసు లేకుండా కేవలం 20 విమానాలు ఉంటే అంతర్జాతీయ సర్వీసులు నడుపుకోవచ్చు. ఈ నిబంధన వల్ల మలేషియాకు చెందిన ఎయిర్‌ ఏషియా, విస్తారా సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు భారీ ప్రయోజనం జరిగింది.