Chandrababu Naidu gives Shock to Revanth Reddy

తెలంగాణ‌లో రోజు రోజుకు క‌నుమ‌రుగ‌వుతోన్న టీడీపీకి రేవంత్‌రెడ్డి కాస్తో కూస్తో మిణుగురులాంటి ఆశాకిర‌ణంగా ఉన్నాడు. రేవంత్‌రెడ్డి తెలంగాణ‌లో ఉన్న మిగిలిన విప‌క్ష పార్టీల నాయ‌కుల‌క‌న్నా కూడా కేసీఆర్‌పై ఒంటికాలితో లేస్తూ టీఆర్ఎస్‌ను టార్గెట్‌గా చేసుకుని ఓ రేంజ్‌లో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే కేసీఆర్‌తో పాటు టీఆర్ఎస్ నాయ‌కులు రేవంత్‌రెడ్డిని ఎంత టార్గెట్ చేస్తున్నా రేవంత్ మాత్రం త‌న దూకుడు ఆప‌డం లేదు.

టీడీపీ త‌ర‌పున ఎంత బ‌లంగా వాయిస్ వినిపిస్తున్నా, ఎంత స్ట్రాంగ్ ఫైట్ చేస్తున్నా రేవంత్ మాత్రం మిగిలిన తెలంగాణ టీడీపీ నాయ‌కుల‌ను అస్స‌లు ఎద‌గ‌నీయ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు కూడా మూట‌క‌ట్టుకుంటున్నారు. చాలా స‌మ‌స్య‌ల‌పై ఆయ‌న ఫైటింగ్ చేసేట‌ప్పుడు మిగిలిన నేత‌లు హైలెట్ కాకుండా త‌న జాగ్ర‌త్త‌లు తాను తీసుకుంటున్నార‌న్న విమ‌ర్శ‌లు ఆయ‌న‌పై ఉన్నాయి. ఇదిలా ఉంటే దూకుడుగా ముందుగా వెళుతోన్న రేవంత్‌రెడ్డికి ఓ విష‌యంలో పార్టీ అధినేత చంద్ర‌బాబు బిగ్ షాక్ ఇచ్చిన‌ట్టు లేటెస్ట్ టాక్ విన‌వ‌స్తోంది.

చంద్ర‌బాబు ఏపీకే ఎక్కువుగా ప‌రిమిత‌మ‌వుతోన్న నేప‌థ్యంలో తెలంగాణ‌లో టీడీపీకి చెందిన ఆల్ఇన్‌వ‌న్ బాధ్య‌త‌ల‌న్నీ రేవంతే చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే 2019 ఎన్నిక‌ల టైంకు కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు తెలంగాణ‌లో ఉన్న ప్ర‌జాసంఘాలు, ఉద్య‌మ‌కారులు, సామాజిక‌వేత్త‌లంద‌రిని ఒకే తాటిమీద‌కు తీసుకువ‌చ్చి కేసీఆర్‌, టీఆర్ఎస్‌పై పోరాడాల‌ని రేవంత్ పెద్ద స్కెచ్ వేశారు. ఈ స‌రికొత్త నినాదంతో కేసీఆర్‌కు ముకుతాడు వేయ‌వ‌చ్చ‌న్న‌దే రేవంత్ ప్లాన్‌.

ఈ క్ర‌మంలోనే వామ‌ప‌క్షాల‌ను సైతం క‌లుపుకుని ముందుకు వెళ్లి విజ‌యం సాధించాల‌ని రేవంత్ భావించారు. ఈ ప్లాన్‌ను చంద్ర‌బాబు చెవిలో వేస్తే బాబు వెంట‌నే ఓకే చేస్తార‌ని రేవంత్ అనుకున్నారు. అయితే చంద్ర‌బాబు మాత్రం వ‌చ్చే ఎన్నిక‌ల టైంకు టీఆర్ఎస్‌కు ప్ర‌త్యామ్నాయంగా టీడీపీని త‌యారు చేయాల‌ని…అప్ప‌టి వ‌ర‌కు తొంద‌ర‌వ‌ద్ద‌ని హెచ్చ‌రించార‌ట‌. దీంతో రేవంత్ ఆశల‌పై చంద్ర‌బాబు ఆదిలోనే నీళ్లు చ‌ల్లిన‌ట్ల‌య్యింది.