జగన్ కోట ని “డీ” కొట్టే చంద్రబాబు “మాస్టర్ ప్లాన్”..     2018-04-16   02:20:36  IST  Bhanu C

ఏ పార్టీ అధ్యక్షులకి అయినా సరే అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే తమ తమ సొంత స్థానాలని కాపాడుకోవడం.. మరియు తమ కొంచుకోటలో మరొక పార్టీ అడుగు పెట్టకుండా ఒక వేళ అడుగు పెట్టినా సరే తిరుగులేని ప్రజాభిమానం మనతో ఉండేలా చేయడం..అయితే ఈ రెండు విషయాలలో ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపి అధినేత జగన్ మొహన్ రెడ్డి ఫెయిల్ అయ్యారు అనే చెప్పాలి…కొద్ది రోజులుగా జ‌రుగుతోన్న ప‌రిణామాలు చూస్తుంటే జ‌గ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌డ‌ప‌లో ఎన్నిక‌ల రేసులో వెన‌క‌ప‌డ‌క త‌ప్ప‌ద‌ని తెలుస్తోంది.

అయితే ఈ క్రమంలో చంద్రబాబు ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు..జగన్ ప్రత్యర్దులని ఒక్కకరిని కలుపుకుని జగన్ కి చెక్ పెట్టే వ్యూహాన్ని రచిస్తున్నారు..ఇప్ప‌టికే వైసీపి నుంచీ టిడిపిలోకి వచ్చిన ఆదినారాయ‌ణ‌రెడ్డి లాంటి వాళ్లు అక్క‌డ జగన్ ని ఎదుర్కోవడంలో ఎంతో స్ట్రాంగ్‌గా నిలబడ్డారు…అయితే ఇప్పుడు టీటీడీ చైర్మన్ గా పుట్టా సుధాకర్ యాదవ్ ఎంపిక కావడంతో కడప రాజకీయాలో మరింత రంజుగా మారిపోయాయి..