Chandrababu is struggling with Revanth Reddy

ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో రేవంత్ ఎపిసోడ్..హాట్ టాపిక్..అయ్యింది..రేవంత్ టి- టీడీపీని వదిలి కాంగ్రెస్ లోకి వెళ్లిపోతున్నారు అనడానికి గత కొన్నిరోజులుగా జరుగుతున్న పరిణామాలే సాక్ష్యం..ఇది ఇలా ఉంటే. ఢిల్లీ నుంచీ తిరిగి వచ్చిన రేవంత్ నిన్న మాట్లాడిన మాటలు సంచలనం సృష్టిస్తున్నాయి.ఒక్కసారిగా ఏపీ – టీడీపీమీద రేవంత్ చేసిన కామెంట్స్ విని షాక్ అయ్యారు అక్కడ ఉన్న వాళ్ళు..ఆ మాటలకి అప్పటివరకు రేవంత్ కాంగ్రెస్ లోకి వెళ్ళరు అని భావించిన వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేసేసుకున్నారు.

తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు టీటీడీపీ నేతలను జైళ్లలో పెడుతున్నారు..మరి ఏపీ టీడీపీ నేతలు మాత్రం కేసీఆర్‌కు వంగి వంగి దండాలు పెడుతున్నారు ..అంటూ టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. వారికి కేసీఆర్‌తో లావాదేవీలు ఉన్నాయని ఆరోపించారు. ఏపీ మంత్రి పరిటాల సునీత కుమారుడి పెళ్లికి వెళ్లినప్పుడు కేసీఆర్‌కు ఏపీ టీడీపీ నేతలు వంగి వంగి దండాలు పెట్టారు. అంతగా సలాములు ఎందుకు కొడుతున్నారు? మరి తెలంగాణలో మాజీ ఎమ్మెల్యే సీతక్క కుమారుడి పెళ్లికి చంద్రబాబు వచ్చినప్పుడు టీఆర్‌ఎస్‌ నాయకులు అలానే చేశారా? ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడితో కేసీఆర్‌కు లావాదేవీలు ఉన్నాయి. కేసీఆర్‌ ఆయనకు రూ.2 వేల కోట్ల విలువైన కాంట్రాక్టులు కట్టబెట్టారు..అంటూ రేవంత్ తనదైన శైలిలో మాట్లాడటం ఏపీ మంత్రుల్లో గుబులు రేపింది..ఏకు మేకవ్వడం అంటే ఇదేనేమో..అని అనుకుంటున్నారు..ఏపీ మంత్రులు