రేవంత్ జంపింగ్ తో ఇరకాటంలో చంద్రబాబు     2017-10-22   04:37:53  IST  Bhanu C

Chandrababu in tension With Revanth Reddy

ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ ఏదన్నా ఉంది అంటే అది రేవంత్ రెడ్డి ఇష్యూనే..రాహుల్ తో రేవంత్ భేటి అయ్యారు అన్న విషయం తెలిసిందే..రేవంత్ పార్టీ మారబోతున్నారు అనే విషయం ఖరారు అయ్యింది కాకపొతే అధికారికంగా వెల్లడికాలేదు..అయితే తనపై వస్తున్న వార్తలకి రేవంత్ ఇంకా క్లారిటీగా సమాధానం చెప్పడం లేదు..అయితే ఒక్క విషయంలో మటుకు రేవంత్ క్లారిటీ ఇచ్చారు..తాను పార్టీ మారకుండా ఉండాలంటే టీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందా…? ఉండదా…? అనేది స్పష్టం చేయాలని చంద్రబాబును కోరారు. టీఆర్ఎస్ తో పొత్తు ఉన్నట్లయితే తన దారి తాను చూసుకుంటానని కుండబద్దలు కొట్టారు రేవంత్ రెడ్డి.

రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా విడదీసి ఏపీ ప్రజల ఆగ్రహానికి కారణమైన కాంగ్రెస్ తో దోస్తీ చేస్తే తెలంగాణలో తెలుగుదేశం బ్రతకచ్చు ఏమో కానీ ఏపీలో టిడీపిని బొంద పెడుతారు అనేది వాస్తవం..ఇప్పటికీ ఏపీ ప్రజలు కాంగ్రెస్ అంటే ఉగిపోతున్నారు..మధ్య మధ్యలో జరుగుతున్న ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఏపీ ప్రజల నుంచీ వస్తున్న స్పందన చూస్తుంటే ఎప్పటికీ కాంగ్రెస్ మీద కోపం తగ్గదు అనే భావన తెలిసిపోతుంది. ఇప్పుడప్పుడే కాంగ్రెస్ పార్టీ ఏపీలో కోలుకునే అవకాశం లేదు అందుకే ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష భాద్యతలని ఎవరికైనా అప్పగించాలన్నా ఎవ్వరూ కూడా ముందుకు రావడం లేదు . ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు తెలంగాణలో కాంగ్రెస్ తో పొట్టు పెట్టుకునే అవకాశమే లేదు అంటున్నారు విశ్లేషకులు.