చంద్రబాబు కి ఓటమి భయం పట్టుకుందా..వీటికి భయపడుతున్నాడా...?     2018-06-13   03:51:38  IST  Bhanu C

ఎన్నిల కమిషన్ ఎంత వాదించినా సరే కేంద్రంతో తెగతెంపులు చెసుకున్న చంద్రబాబు కి మాత్రం భయం పట్టుకుంది

హైటెక్ ముఖ్యమంత్రిని అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఈవీఎంల గురించి ఇప్పుడు ఆందోళన చెందడం అందరిని ఆశ్చర్యపెడుతోంది.. ఈవీఎంలని దుర్వినియోగం చేయడం ఎంతో సులభమని అందుకే వాటి విషయంలో ఎంతో జాగ్రత్తా ఉండాలని బాబు నేతలకి చెప్తున్నారట..అమరావతిలోని ప్రజాదర్బార్ హాలులో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ఈ మేరకు ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు కూడా ఈవీఎంల పని తీరుపై అనుమానాలు వ్యక్తం చేశారట.

అంతేకాదు గతంలో చంద్రబాబు ఈవీఎంల లని ఎలా ట్యాంపరింగ్ చేయొచ్చనే విషయాన్ని ఎన్నికల కమిషన్ వద్దకి వెళ్లి మరీ ఆధారాలతో చూపించిన విషయాన్ని మంత్రి కాల్వ శ్రీనివాసులు గుర్తు చేశారు..బ్యాలెట్ పేపర్ అయితే ఎవరికీ అనుమానం ఉండదు ఎంతో మంది నేతలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈవీఎంల ని వ్యతిరేకిస్తున్నారు అలాంటప్పుడు ఎందుకు వాటిని కోసాగించడం అంటూ ఈ చర్చని జాతీయ స్థాయిలో తీసుకువెళ్తామని తెలిపారట..అయితే తన రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూసిన చంద్రబాబు కేవలం ఈవీఎం లకి భయపడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది అంటున్నారు విశ్లేషకులు .