చంద్రబాబు కి ఓటమి భయం పట్టుకుందా..వీటికి భయపడుతున్నాడా...?     2018-06-13   03:51:38  IST  Bhanu C

ఏపీ లో సీనియర్ నాయకుడిని..దేశం మొత్తంలో నా అంత సీనియర్ లేడు..నేను ఎవ్వరికి భయపడను అంటూ చెప్పుకునే చంద్రబాబు..ఇప్పుడు ఒక విషయంలో మాత్రం తెగ భయపడిపోతున్నాడట..కేంద్రం మెడలు వంచుతా అంటూ వార్నింగ్ ఇచ్చే చంద్రబాబు ఒకే ఒక్క విషయంలో తెగ మదన పడుతున్నాడట..గెలుపు పై ధీమా ఉంది కానీ వాటిపై నమ్మకం లేదు అంటూ సన్నిహితుల వద్ద బాబు వాపోతున్నారు అని టాక్ వినిపిస్తోంది..ఇంతకీ చంద్రబాబు కి ఎందుకు ఓటమి బెంగ పట్టుకుని..చంద్రబు వేటిని చూసి భయపడుతున్నారు అనే వివరాలలో వెళ్తే.

దేశంలో కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో వరుసగా బీజేపి గెలుపు సొంతం చేసుకుంది..వరుసగా బీజేపి తిరుగులేని ఆధిక్యాన్ని సొంతం చేసుకోవడం తాజాగా కర్ణాటక ఎన్నికల్లో ఎవరి పొత్తు లేకుండానే 104 సీట్లు కైవసం చేసుకుని ప్రాంతీయ పార్టీలకి ఘలక్ ఇచ్చింది అయితే ఇంతటి భారీ గెలుపు వెనుకాల బీజేపి వరుస విజయాల పై ఈవీఎంల మీద ఎన్నో అనుమానాలు తలెత్తాయి. ఈవీఎంల ట్యాంపరింగ్ మూలంగానే బీజేపీ గెలుపు సులువు అవుతున్నదని ఎన్నికల వ్యవస్థను బీజేపీ అపహాస్యం చేస్తుందని ఆరోపణలు వచ్చాయి..అయితే బీజేపి గెలుపుకి ఈవీఎం ల కి సంభంధం లేదని వాదిస్తోంది ఎన్నికల కమిషన్..