2019 వార్‌... బాబుకు చెమ‌ట‌లు స్టార్ట్‌     2018-06-09   23:16:11  IST  Bhanu C

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏదైనా జ‌ర‌గొచ్చు! ఈరోజు ఉన్న హ‌వా రేప‌టికి మ‌టుమాయం కావొచ్చు! 2014లో ఇది అనుభ‌వం కూడా అయింది. అప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్ తిరుగులేదు. జ‌గ‌నే సీఎం అని అంద‌రూ అన్నారు. ఆఖ‌రుకు.. రాజ‌కీయ గండ భేరుండ‌ల‌కు సైతం చెమ‌ట‌లు ప‌ట్టించి ప్ర‌త్యేక రాష్ట్రం సాధించుకున్న టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ సైతం.. ఏపీలో జ‌గ‌న్ ప్ర‌బుత్వం వ‌స్తుంద‌ని జోస్యం చెప్పారు. అయితే, ఫ‌లితాలు వ‌చ్చాక సీన్ రివ‌ర్స్. అస‌లు ఉనికిలోకూడా ఉండ‌ద‌ని అనుకున్న చంద్ర‌బాబు పార్టీ అధికారంలోకి వ‌చ్చేసింది. ముచ్చ‌ట‌గా నాలుగేళ్లు పూర్తి కూడా చేసుకుంది. ఇదీ.. ప‌రిస్థితి.

క్ష‌ణ‌క్ష‌ణ‌ముల్ ప్ర‌జ‌ల చిత్త‌ముల ప్ర‌కార‌మే రాజ‌కీయాలు, రాజ‌కీయ నాయ‌కుల భ‌విష్య‌తు తిర‌గ‌బ‌డుతూ ఉంటుంద‌న డంలో సందేహం లేదు. తాజాగా ఏపీ విష‌యానికి వ‌స్తే.. మ‌రో ప‌దిమాసాల్లో ఇక్క‌డ ఎన్నిక‌లు ఉన్నాయి. ప్ర‌స్తుత అధికార పార్టీ టీడీపీ.. మ‌ళ్లీ అధికారంలోకి రావాల‌ని సీఎం చంద్ర‌బాబు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. ప్ర‌జ‌ల‌ను ఆదిశ‌గా కూడా స‌మాయ‌త్తం చేస్తున్నారు. అయితే, ఆయ‌న‌కు అనుకూలంగా ప్ర‌జ‌లు ఉన్నారా? మ‌ళ్లీ ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు ఓట్లేస్తారా? తిరిగి బాబునే సీఎంను చేస్తారా? అనే ప్ర‌శ్న‌లు రాష్ట్రంలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.