ఇంటా.. బయటా బాబుపై పెరుగుతున్న వ్యతిరేకత..దేశంలో ఏమవుతోంది..?     2018-06-13   23:29:30  IST  Bhanu C

ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి..ఒక పక్క జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్ర ని దిగ్విజయంగా కొనసాగిస్తూ దూసుకుపోతుంటే మరో పక్క నీళ్ళు లేని నదిలో పడవని నడిపే నావికుడిలా చంద్రబాబు ఏమి చేయాలో అర్థం కాకా జగన్ పై ఆరోపణలు చేస్తూ ఎవరో ఒక నాయకుడితో జగన్ పై కామెంట్స్ చేయిస్తున్నారు..జగన పై బాబు పెడుతున్న శ్రద్ధ తమ నేతలపై ఆయన పాలనపై గనుకా పెట్టి ఉంటే ప్రజలు చంద్రబాబు పై నమ్మకాన్ని పెట్టుకునే వారు..కానీ పాలనని అటకెక్కించి మరీ అనునిత్యం జగన్ పై తెలుగుదేశం నాయకుడు చేస్తున్న రాజకీయాలు రోజూ చూస్తున్న వారికి విసుగు తెప్పిస్తున్నాయి..చంద్రబాబు పై ఉన్న నమ్మకాన్ని రోజు రోజు కి తగ్గిస్తున్నాయి..

అయితే ఎప్పుడు నిండు కుండ లా ఉండే చంద్రబాబు కి ఎందుకింత టెన్షన్ అంటే..దానికి కారణం ఒక్కటే జగన్ కు జానాధరణ రోజు రోజుకీపెరిగిపోవడమే జగన్ సంగతి ఇలా ఉంటే…ఇక జగన్ సంగతి పక్కన పెడితే పక్కలో బల్లెంలా మొన్నటి వరకూ బాబు గారికి భజన చేసిన పవన్ కళ్యాణ్ రూపంలో బాబు గారికి మరింత టెన్షన్ ఏర్పడింది..పవన్ వలన జరిగే డ్యామేజ్ చాపకుండా నీరులా చాలా సైలెంట్ గా జరిగిపోతోంది..పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ప్రజలపై ఉంది కాబట్టే గత ఎన్నికల్లో చంద్రబాబు పవన్ వెనకాల పడ్డారు అంటారు..ఇప్పుడు ఇదే భయం బాబు కి ఏర్పడింది..పవన్ బాబు ని టార్గెట్ చేసుకుని మాట్లాడే ప్రతీ సారి బాబు కి బీపీ హైప్ కి వెళ్తోందట.?