“లోకేష్” పోటీ చేసే స్థానం ఇదే...“ ఫిక్స్” చేసిన చంద్రబాబు     2018-04-27   02:18:51  IST  Bhanu C

ఏపీలో ఎన్నికల హీట్ రోజు రోజు కీ పెరిగిపోతోంది..ప్రధాన పార్టీలు అయిన తెలుగుదేశం , వైసీపి లు ఇప్పటికే అభ్యర్ధుల ఎంపిక స్థానాలపై ఒక నిర్ణయానికి వచ్చేశారు అయితే కీలకమైన నేతల విషయంలో తర్జన బర్జన పడుతున్నారు..అయితే జూన్ నెలాఖరుకల్లా అన్ని స్థానాలని ఫిక్స్ చేయడానికి గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది..ఈ క్రమంలోనే చంద్రబాబు లోకేష్ ని ఎక్కడి నుంచీ పోటీ చేయించాలి అనే సందిగ్ధంలో ఉన్నారట..ఇప్పుడు సర్వాత్రా లోకేష్ పోటీ చేసే స్థానం పైనే చర్చ నడుస్తోంది.

లోకేష్ ని ఎమ్మెల్సీ చేసి ఆపై మంత్రి వర్గ విస్తరణలో మంత్రిని చేసిన చంద్రబాబు వచ్చే ప్రత్యక్ష ఎన్నికల్లో తన కొడుకు మొదటి సారిగా పోటీ చేస్తుండటంతో తీవ్ర సందిగ్ద్దానికి లోనవుతున్నారట అయితే చంద్రబు ఎప్పటిలాగానే తన స్థానం అయిన కుప్పం నుంచీ పోటీ చేస్తున్నారు..పోనీ లోకేష్ మామ బాలయ్య నియోజకవర్గం నుంచీ పోటీ చేయించాలి అనుకుంటే బాలయ్య ఆస్థానం మీద ఆశక్తి చూపుతున్నారట..దాంతో చంద్రబాబు లోకేష్ కోసం ఒక స్థానాన్ని ఫిక్స్ చేసుకున్నారట..ఇంతకీ ఎక్కడ నుంచీ లోకేష్ ని పోటీ చేయిస్తున్నారు అంటే..

లోకేష్ కోసం చంద్రబాబు పెనమలూరు ని సిద్దం చేస్తున్నారట… పెనమలూరు కి గత ఎన్నికల్లో గోదావరి జిల్లాలో ఎక్కడా లేని విధంగా 31,000 పై చీలుకు మెజారిటీ వచ్చింది ఈ నియోజకవర్గంలో ఏకంగా కాపుల ఓటింగ్ శాతం 50,000 ఉండటంతో లోకేష్ ని ఇక్కడి నుంచీ పోటీ చేయిస్తేనే గెలుపు సునాయాసనంగా ఉంటుందనేది చంద్రబాబు ప్లాన్ గా తెలుస్తోంది.. అయితే పెనమలూరులో తిరుగులేని నేతగా ఉన్న బోడె ప్రసాద్ ఉండగా ఆయన్ని తప్పించి లోకేష్ ని పెట్టడానికి గల కారణం కూడా చంద్రబాబు సిద్దం చేశారట..అదేంటంటే..