లోకేష్ కి క్లాస్.. పీకిన చంద్రబాబు...     2017-10-22   00:46:29  IST  Bhanu C

Chandrababu Fires on lokesh

ఏపీ ముఖ్యమంత్రి ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నా..రేవంత్ ఇష్యూ తో తన మైండ్ అంతా ఇక్కడే తిరుగుతోంది. రేవంత్ లాంటి వ్యకి..తెలంగాణా లో పార్టీని వీడితే తెలుగుదేశానికి తెలంగాణాలో తీవ్రమైన నష్టం జరుగుతుంది అనేది వాస్తవం. రేవంత్ పార్టీని వీడటం ఖాయం అయినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ టీటీడీపీ వర్కింగ్ కమిటీ సమావేశానికి రావడం ఆసక్తికరమైన అంశం ఇక్కడ వరకు బాగానే నడిచినా ఇక్కడే చంద్రబాబు అగ్గిమీద గుగ్గిలంలా విరుచుకు పడ్డారట..అమెరికా నుంచీ ఫోను చేసి మరి తలంటే శారు తనయుడు లోకేష్ కి.ఎందుకు లోకేష్ కి అంతగా క్లాస్ పీకారు అంటే..

విషయమేమిటంటే..తెలంగాణ టీడీపీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో లోకేష్ కు గట్టిగా క్లాస్ ఇచ్చాడట బాబు. తను అందుబాటులో లేని సమయంలో ఇక్కడ జరుగుతున్నవిషయాలకి సంభవించిన గొడవలు ముదిరిపోతున్నాయి.. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోనే ఉండి కూడా.. ఈ వ్యవహారాలను పరిష్కరించకుండా , కనీసం వాటిలోకి జోక్యం కూడా చేసుకోకుండా లోకేష్ ఉండటం బాబుకి కోపం తెప్పించిందట. ఈ విషయంలోనే బాబు లోకేష్ మీద తీవ్ర అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది.తెలుగుదేశం పార్టీలో ప్రతేఒక్కరు ఈవిషయం గురించే చర్చించుకుంటున్నారు.