ఎన్నికల వేడి పుట్టించనున్న బాబు...జులై 16 ముహూర్తం     2018-06-17   01:54:56  IST  Bhanu C

ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో చంద్రబాబు తన ఆలోచనలకి పదును పెట్టనున్నారు..ఇప్పటికే ఎన్నో రకాల వ్యుహాలని సిద్దం చేసుకున్న చంద్రబాబు..కేంద్రానికి వెన్నులో వణుకు పుట్టించే ప్లాన్ కూడా ఒకటి సిద్దం చేశాడని తెలుస్తోంది..ఇప్పటికే కీలక నేతలతో ఈ వ్యుహలకి తుదిమెరుగులు చంద్రబాబు దిద్దేశారట..అయితే ఏపీలో టీడీపి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవయితే ఉన్నాయో వాటిని విస్తృతంగా ప్రచారం కల్పిస్తూ టీడీపీ ని మరింతగా ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలని అనుకుంటున్నారు..

ఇప్పుడు ఏపీలో ఉన్న పరిస్థితిలో ఏపీ ప్రజానీకాన్ని తన వైపు తిప్పుకోవాలంటే ఒకే ఒక్క అవకాశం ఉంది అదికూడా తెలుగుదేశం పార్టీ కి ఈ క్రెడిట్ అంతా వెళ్ళిపోవడానికి చంద్రబాబు ఒక భారీ ప్లాన్ వేసుకున్నారు

చంద్రబాబు నాయుడు గతంలో ఊపు మీదున్న ఆంధ్రుల పోరాటాన్ని యిప్పుడు తెరపైకి తీసుకురావలని ట్రై చేస్తున్నాడు..ఈ పోరాటాన్ని ఆత్మగౌరవం నినాదంతో ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు..

ఈ క్రమంలోనే నిన్న మంత్రులు, ఎంపీలతో సమావేశమయిన బాబు రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చేవిధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకరావాలని వారికి దిశానిర్దేశం చేశాడు.