మాతో బాగుంటే సరే ! లేదంటే అందరూ ద్రోహులే !     2018-06-16   00:39:40  IST  Bhanu C

మేము చేస్తే సంసారం …పక్కవాళ్ళు చేస్తే వ్యభిచారం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. తాను మొన్నటివరకు అంటకాగిన బీజేపీతో వైసీపీ , జనసేన పార్టీలు అంటకాగడం బాబు లో అసహనాన్ని పెంచుతున్నాయి. తాము నాలుగేళ్లపాటు తిరిగినప్పుడు అనిపించని.. కనిపించని లోపాలాన్ని ఇప్పుడు బాబు కి ఆ రెండు పార్టీలు బీజేపీతో తిరగడంతో అనిపిస్తున్నాయి.

టీడీపీ అధినేత తీరు ఎలా ఉందంటే.. బీజేపీతో ఎవరూ పొత్తు పెట్టుకోకూడదు.. ఎవరూ ఆ పార్టీకి మద్దతు ఇవ్వకూడదు ఆలా చేస్తే వారు ఏపీకి ద్రోహం చేసినట్టే అనే ఫీలింగ్ లో బాబు అండ్ కో బృందం ఉన్నారు. చంద్రబాబు నాయుడితో బాగుంటే.. ఇటలీ దెయ్యం అయినా.. ఇంటికి వెలుగవుతుంది. మరి చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ బీజేపీ, టీఆర్ఎస్, కమ్యూనిస్ట్ పార్టీలు,జనసేన,రాష్ట్రంలోని చిన్నాచితక పార్టీలన్నింటితో జతకట్టింది అంతెందుకు టీడీపీ కి ఆజన్మ విరోధి అయిన కాంగ్రెస్ తో బాబు చేయికలపడానికి కూడా సిద్ధం అయ్యారు . కానీ ఇదంతా ఏపీ అభివృద్ధి కోసమే అన్నట్టు టీడీపీ కవరింగ్ చేసుకుంటోంది.