Chandrababu Cabinet Expansion list 2017

ఏపీలో చంద్ర‌బాబు మంత్రి వ‌ర్గంలో మార్పుల‌కు రంగం సిద్ధ‌మైంది. అస‌మ‌ర్థుల‌కు, అవినీతి ప‌రులు అంటూ గ‌త కొన్నాళ్లుగా తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వారికి చంద్ర‌బాబు ఇక చెక్ పెట్ట‌నున్నారు. అదేస‌మ‌యంలో పార్టీని తిరిగి 2019లో అధికారంలోకి తీసుకువ‌స్తార‌ని భావిస్తున్న వారికి, ముఖ్యంగా వైకాపా అధినేత జ‌గ‌న్ అండ్ ప‌రివారం దూకుడికి స‌మ‌ర్థంగా జ‌వాబు చెబుతార‌ని అనుకుంటున్న‌వాళ్ల‌కి పెద్ద పీట వేసేందుకు చంద్ర‌బాబు రంగం రెడీ చేశారు. వాస్త‌వానికి గ‌త ఏడాది ద‌స‌రా నుంచే మంత్రి వ‌ర్గ మార్పు చేర్పుల‌పై వార్త‌లు వ‌స్తున్నాయి.

అయితే, అప్పుడు, ఇప్పుడు అంటూ వ్యాఖ్య‌లు వినిపించ‌డ‌మే కానీ, నిజానికి బాబు కార్య‌రంగంలోకి దూకింది లేదు. కానీ, 2019 ఎన్నిక‌ల‌కు మూహూర్తం ముంచుకు రావ‌డం, వ‌చ్చే ఎన్నిక‌లు ప్ర‌తిష్టాత్మ‌కంగా మార‌డం, ఒక ప‌క్క జ‌గ‌న్ దూకుడు పెరగ‌డం, ప్ర‌త్యేక హోదా సెంటిమెంట్‌గా మారుతుండ‌డం, ఇదిలావుంటే, త‌మ‌తో 2014లో క‌లిసివ‌చ్చిన జ‌న‌సేనాని ప‌వ‌న్ ఇప్పుడు సొంత కుంప‌టిని వెలిగించుకునే ప‌నిలో ఉండ‌డం నేప‌థ్యంలో పార్టీని బ‌లోపేతం చేయ‌డంతోపాటు 2019 ఎన్నిక‌ల్లో పార్టీ తిరిగి అధికారంలోకి వ‌చ్చే ప‌నితీరు చూపించ‌గ‌ల వారికి బాబు ఇప్పుడు గుర్తింపు ఇవ్వ‌నున్నార‌నే టాక్ వినిపిస్తోంది.

ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఏడుగురు మంత్రుల‌కు శ్రీముఖాలు అంద‌జేయ‌డంతో పాటు.. కొత్త‌గా త‌న పుత్ర‌ర‌త్నం లోకేష్‌తోపాటు 13 మంది యువ సైన్యాన్ని మంత్రి వ‌ర్గంలోకి తీసుకోవాల‌ని బాబు రెడీ అయ్యార‌ని తెలుస్తోంది. వీరిలో జ‌గ‌న్‌పై విరుచుకుప‌డేవారితో పాటు డ‌బ్బును లెక్క చేయ‌కుండా ఖ‌ర్చు చేయ‌గ‌లిగే వారు కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు, ఎంత‌కైనా సిద్ధ‌ప‌డే ఒక‌రిద్ద‌రు ఇండ‌స్ట్రియ‌లిస్టులు కూడా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో బాబు కేబినెట్ ప్ర‌క్షాళ‌న‌కు ప్రాముఖ్యం సంత‌రించుకుంది. మ‌రి వీరైనా బాబు క‌ల‌లు నెర‌వేరుస్తారో లేదో చూడాలి.

ఉద్వాస‌న త‌ప్ప‌ని మంత్రులు!

‘కిమిడి మృణాళిని'(విజయనగరం) (అవినీతి ఆరోప‌ణ‌లు. విధుల్లో కుటుంబ జోక్యం పెరిగిపోవ‌డం)
‘పీతల సుజాత(పశ్చిమగోదావరి)(బంగారు న‌గ‌లు గిఫ్ట్‌గా అందుకోవ‌డం, అవినీతి, ఇసుక మాఫియాకు అండ‌గా నిల‌వ‌డం)
కొల్లు రవీంద్ర(కృష్ణా)(అవినీతి, బెల్టు షాపులు అరిక‌ట్ట‌లేక‌పోవ‌డం, విజ‌య‌వాడ‌లో క‌ల్తీ మ‌ద్యం ఘ‌ట‌న‌)
పత్తిపాటి పుల్లారావు(గుంటూరు), (కుటుంబ స‌భ్యుల మితిమీరిన జోక్యం, 4 వేల కోట్ల‌ ప‌త్తి కుంభ‌కోణం)
రావెల కిశోర్‌బాబు(గుంటూరు) (పుత్ర ర‌త్నాల వెకిలి చేష్ట‌లు, త‌న కులం వారికే ప్రాధాన్యం ఇవ్వ‌డం, అవినీతి. వైకాపాతో సంబంధాలు పెట్టుకోవ‌డం)
బొజ్జల గోపాలకృష్ణారెడ్డి (చిత్తూరు)(వ‌య‌సు రీత్యా ప‌నిలో వెనుక‌బాటు)
పల్లెరఘునాథరెడ్డి(అనంతపురం) (తీవ్ర అస‌మ‌ర్థత‌. తెలంగాణ‌తో పోల్చుకుంటే పూర్తి వెనుక‌బాటు త‌నం)

కేబినెట్‌లో సీటు ఖ‌రారైంది వీరికే..

‘నారా లోకేష్ సీఎం త‌న‌యుడు
కళావెంకట్రావు(శ్రీకాకుళం)
సుజయ్‌కృష్ణారంగారావు (విజయనగరం)(వైకాపా జంపింగ్ ఎమ్మెల్యే)
వంగ‌ల‌పూడి అనిత(విశాఖపట్నం)
గొల్లపల్లి సూర్యారావు(తూర్పు గోదావరి)
మహ్మద్‌ షరీఫ్‌(పశ్చిమగోదావరి)
బోండా ఉమామహేశ్వరరావు(విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌)
యరపతినేని శ్రీనివాసరావు(గుంటూరు)
అనగాని సత్యప్రసాద్‌(గుంటూరు)
సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి(నెల్లూరు)
గొట్టిపాటి రవికుమార్‌(ప్రకాశం) (వైకాపా జంపింగ్‌)
భూమా నాగిరెడ్డి లేదా భూమా అఖిల ప్రియ(కర్నూలు) (వైకాపా జంపింగ్‌)
పయ్యావుల కేశవ్‌(అనంతపురం)