ఇక బాబు పనైపోయిందా..? ఢిల్లీ లో ఏంజరుగుతోంది..?  

కర్ణాటకలో హడావుడి అయిపోవడంతో ఇప్పుడు ఏపీ పై బీజేపీ పెద్దలు దృష్టిపెట్టారు. చంద్రబాబు ని ఏదో ఒక అవినీతి విషయం లో ఇరుకున పెట్టి రాజకీయంగా దెబ్బకొట్టాలని చూస్తున్నారు. అందుకే పాత విషయాలన్నీ కెలికే పనిలో ఉన్నారు బీజేపీ పెద్దలు. అందుకే ఏదైనా బలమైన ఆధారాలు సంపాదించి ఆ తరువాత చంద్రబాబు మీద ఆరోపణలు చేయించి… వాటిపై విచారణ వేసి బాబు ని ఉక్కిరిబిక్కిరి చేయాలనే వ్యూహం పన్నుతోంది బీజేపీ.

పోలవరం ప్రాజెక్ట్ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం అంతులేని అవినీతికి పాల్పడిందని కేంద్రం సమాచారం సేకరించింది. అయితే దీనిపై బలమైన సాక్ష్యాలు సేకరించే పనిలో కేంద్రం నిమగ్నమయ్యింది. రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై కేంద్రం సీబీఐ విచారణ దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. రాష్ట్రంలోని వివిధ కాంట్రాక్టర్లను ఢిల్లీకి పిలిపించుకుని వారితో చర్చలు సాగిస్తోందట.