నాకు పీఎం వద్దు .. నాకు సీఎం వద్దు ! తండ్రి కొడుకుల త్యాగం !     2018-06-05   23:19:14  IST  Bhanu C

రాజకీయాల్లో భజనపరులు ఉండడం షరా మాములే ! అధినాయకుడి మెప్పు పొంది ఏదో ఒక లబ్ది పొందాలని చూసేవారు సాధారణంగానే ఇక్కడ ఎక్కువ ఉంటారు. ఇక అధికార పార్టీ అయితే చెప్పేది ఏముంది. ఇక ఏపీ సీఎం చంద్రబాబు భజన పరుల్లో అందరికంటే ఇప్పుడు ముందు వరుసలో ఉన్నవారు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ఈయన కు అలవాటులేని పని కొత్తగా ఎంచుకుని బాబు అండ్ ఫ్యామిలీని పొగడడమే పనిగా పెట్టుకున్నాడు. ఇటీవల మహానాడులో జేసీ చేసిన వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్యపరిచాయి.

ఇక మీరు ఎంతకాలం ముఖ్యమంత్రిగా ఉంటారు . మీరు అర్జంటుగా ప్రధానమంత్రి అవ్వాల్సిందే అంటూ జేసీ డిమాండ్ కూడా చేసాడు. దీనికి చంద్రబాబు చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. జేసీ అంతటితో ఆగాడా..? వచ్చే ఎన్నికలతో చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి అవుతాడని, లోకేష్ బాబు ముఖ్యమంత్రి అవుతాడని జోస్యం కూడా చెప్పేసాడు. రాజకీయాలు మాని ఇలా జోస్యం చెప్పడం ఎప్పుడు నేర్చుకున్నాడో కానీ దివాకర్ రెడ్డి ఈ మాటలతో పెద్ద భజన పరుడు అనిపించుకున్నాడు. చంద్రబాబు, లోకేష్ లను అలా అమాంతం పైకి ఎత్తేశాడు .