Chandrababu 7 big mistakes     2017-12-28   23:11:23  IST  Bhanu C

Chandrababu 7 big mistakes

కర్ణుడి చావుకి వెయ్యి కారణాలు అంటారు..అయితే చంద్రబాబు కి వచ్చే ఎన్నికల్లో పారాజయం చవి చూడటానికి మాత్రం ఈ ఏడూ కారణాలు చాలు అంటున్నారు విశ్లేషకులు.. 2019 ఎన్నికల్లో కూడా మళ్ళీ తిరిగి అధికారాన్ని దక్కించుకోవడానికి ఎంతో ప్రయతిస్తున్నారు బాబు..అందుకు తగ్గట్టుగా ఎత్తులకి పై ఎత్తులు వేస్తూ వచ్చారు.అయితే రాకకీయంగా అభివృద్ధి ని పక్కన పెట్టి వైసీపిని దెబ్బ కొట్టే పనిలో భాగంగా బాబు చాలా తప్పటడుగులు వేశారనే చెప్పాలి..అయితే ఇప్పుడు అవే బాబు పాలిత శాపాలుగా మరి అధికారాన్ని కోల్పోయేలా చేసే అవకాశం ఉంది అంటున్నారు..మరి చంద్రబాబు చేసిన బిగ్ మిస్టేక్స్ ఏమిటో మీరు చుడండి..

ఫిరాయింపుల గాలం ఎఫెక్ట్ వైసీపి అధినేతకి తగిలిందో లేదో కానీ చంద్రబాబు కి మాత్రం గట్టిగానే తగిలింది అని చెప్పాలి..ఈ విషయంలో బాబు పెద్ద తప్పు చేశారు అనే విషయాన్ని ప్రజలలోకి తీసుకెళ్ళడంలో జగన్ సక్సెస్ అయ్యారు ప్రజలు కూడా ఎంతో హుందాగా ఉండే చంద్రబాబు ఇలా చేశారు ఏంటి అని అనుకున్నారు…2014లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి వైసిపిని దెబ్బకొట్టటం ఎలాగ అన్న విషయంపైనే దృష్టి పెట్టిన బాబు..ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దెబ్బకొట్టేందుకు ప్రయోగించిన ఫిరాయింపుల ప్రయోగం జాతీయ స్ధాయిలో అపఖ్యాతిని తెచ్చిపెట్టింది.

అసలు చంద్రబాబు కి ప్రజలు ఓట్లేయడానికి 80 % కారణం ఒక్కటే అనుభవం ఉన్న వ్యక్తి..హైటెక్ సిటీ లాంటి ఎన్నో అభివృద్ధి పనులు చేశారు అని..అదే కోణంలో రాజధాని నిర్మాణం తన వల్లే అవుతుందని.. పోలవరం టిడిపి మాత్రమే పూర్తి చేయగలదు అంటూ ప్రచారం చేసి గద్దె నెక్కిన బాబు..అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్ళవుతున్నా పోలవరం, రాజధాని నిర్మాణం సంగతి..గ్రాఫిక్స్ లో చూపిస్తున్నారు తప్పితే ప్రయోజనం మాత్రం సూన్యం అనే చెప్పాలి. పోలవరం నిర్మాణంలో అయితే చేతులు ఎత్తిసిన పరిస్థితి ఉంది.