బాబు అలా ఇరుక్కుపోయాడు .. తెలంగాణాలో ప్రచారమంటేనే వణుకు     2018-09-12   09:28:18  IST  Sai M

అర్ధాంతరం గా వచ్చిన ముందస్తు ఎన్నికలు అందరిని ఇబ్బంది పెడుతున్నాయి లేదో తెలియదు కానీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాయి. సాధారణ ఎన్నికలతో పాటే తెలంగాణాలో కూడా ఎన్నికలు వస్తే ఏపీ లో ప్రచారం చెయ్యాలనే వంకతో తప్పించుకునేవాడు. అయితే.. ఇపుడు ఆ పప్పులేమి ఉడకవు. తప్పనిసరిగా ప్రచారానికి వెళ్లాల్సిందే. వెళ్తే కేసీఆర్ ఊరుకుంటాడా.. పాత కేసులు అన్ని తిరగతోడి మరి ఇబ్బంది పెట్టేస్తాడు. అందుకే కక్కలేక మింగలేక బాబు తెగ ఇబ్బంది పడిపోతున్నాడు.

CM KCR,Telangana Elections Campaign,Vote For Note Case

తెలంగాణ ఎన్నికలు కొత్త టెన్షన్ గా మారాయి. అక్కడ రంగంలోకి దిగితే ఒక తలనొప్పి, దిగకపోతే మరో తలనొప్పి అన్నట్టుగా తయారైంది చంద్రబాబు నాయుడి పరిస్థితి. తెలంగాణలో తను ప్రచారం చేయను అని ఇప్పటికే చంద్రబాబు ప్రకటించేశాడు. దీంతో బాబు ఇంకా బయపడుతున్నాడు అని అంతా గుసగుసలాడేసుకుంటున్నారు. తెలంగాణలో తను ప్రచారం చేస్తే కేసీఆర్ ఎక్కడ ఓటుకు నోటు కేసును కదిలిస్తాడో అని చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడని స్పష్టం అయిపోతోంది. ఓటుకు నోటు కేసు పవర్ అలాంటిది మరి. అందరికీ నీతులు చెప్పి అందరి మీదా బురదజల్లే చంద్రబాబు నాయుడు.. ఒక అవినీతి కేసులో ఇరుక్కుని ఇలా ఒక రాష్ట్రంలో అడుగుపెట్టలేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు.

CM KCR,Telangana Elections Campaign,Vote For Note Case

తెలంగాణాలో ఎలాగూ బలం లేదు కాబట్టి ఇక్కడ పోటీకి దూరంగా ఉందామా అంటే అది కుదరని పని. ఎందుకంటే ఇంకా పార్టీని అంటిపెట్టుకుని చాల మంది నాయకులు ఉన్నారు. వారంతా ఎన్నికల్లో పోటీచేసేందుకు తహతహలాడుతున్నారు. అందుకే ఇక్కడ టీడీపీ పోటీ చేస్తే … ఎన్నో కొన్ని సీట్లను సంపాదించుకున్నా.. చక్రం తిప్పవచ్చని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు. కానీ సాక్షాత్తు పార్టీ అధినేతే ప్రచారానికి రానని చెప్పుతుండడం పార్టీ శ్రేణులకు మింగుడుపడడంలేదు. ప్రజల్లో ఇది ఎటువంటి సంకేతాలు ఇస్తాయో అని అనాలని చెందుతున్నారు. అయితే ఓటుకు నోటు కేసు పవర్ అలాంటిది మరి.