చామంతి టీ చర్మానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా?     2018-06-29   01:42:59  IST  Lakshmi P

టీని ఇష్టపడని వారు ఎవరు లేరు. టీలలో కూడా చాలా రకాలు ఉన్నాయి. బ్లాక్ టీ, గ్రీన్ టీ, వైట్ టీ, అల్లం టీ,చామంతి టీ ఇలా ఎన్నో రకాల టీలు ఉన్నాయి. అయితే వీటిలో ఈ రోజు చామంతి టీ గురించి తెలుసుకుందాం. చామంతి టీ త్రాగటం వలన మనకు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుంటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ముందుగా చామంతి టీ ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం. చామంతి పూలను ఎండబెట్టి పొడి చేసి నీటిలో వేసి మరిగించి డికాషన్ తయారుచేయాలి. చామంతి టీ ఉపయోగాలు తెలుసుకుందాం.

చామంతి టీలో వాపు వ్యతిరేక లక్షణాలు ఉండుట వలన ఎన్నో చర్మ సమస్యల నివారణలో ఉపయోగపడుతుంది. సమస్య ఉన్న ప్రాంతంలో చామంతి టీని రాసి 5 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. చర్మాన్ని శుభ్రపరచి సహజమైన బ్లీచ్ గా, మాయిశ్చరైజర్ గా పనిచేసి చర్మాన్ని కాంతివంతంగా ఉండేలా చేస్తుంది.