హీరోయిన్ బికినీ అందాలు తట్టుకోలేకపోయిన సెన్సార్ వారు

ఏదో పైకి చెప్పటానికి తమకు గ్లామరస్ రోల్స్ చేయడం పెద్దగా ఇష్టం ఉండదని పైకి చెబుతూ ఉంటారు చాలామంది హీరోయిన్లు. కాని గ్లామరస్ రోల్స్ చేస్తేనే కెరీర్ ఎక్కువ కాలం ఉంటుందని, కమర్షియల్ సినిమాల్లో ఆఫర్లు వస్తాయని, దాంతో పారితోషికం బాగా పెంచవచ్చని వారికి కూడా తెలుసు. కాని ఆఫ్ స్క్రీన్ ఇమేజ్ కోసం స్టేట్మెంట్స్ ఇస్తుంటారు. కాని కుర్ర హీరోయిన్ సీరత్ కపూర్ అలా కాదు. తనకి గ్లామర్ ఒలకబోయటం ఇష్టమే, పాత్ర డిమాండ్ చేయాలే కాని సినిమా మొత్తం బికినీతో కనిపించమన్నా కనిపిస్తా అంటూ చాలాసార్లు చెప్పింది. సీరత్ ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వకతప్పదు. ఎందుకంటే అవకాశల కరువు ఉందిగా.

రన్ రాజా రన్ సూపర్ హిట్ అవడంతో శర్వానంద్ కెరీర్ మలుపు తిరిగింది కాని, అదే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన సీరత్ పరిస్థితి లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. పక్కా తెలుగు హీరోయిన్ లక్షణాలు కనిపించకపోవడం వలనేమో, పెద్దగా పట్టించుకోలేదు దర్శకనిర్మాతలు. వారి కోసమే అందాల ఆరబోత మొదలుపెట్టింది సీరత్. అందుకు రాకరాక వచ్చిన అవకాశం రాజుగారి గది 2 వేదికైంది.

ఈ సినిమాలో సీరత్ ఎంతలా రెచ్చిపోయి అందాలు ఆరబోసిందంటే, సెన్సార్ వారు ఆ బికినీ అందాల ధాటికి తట్టుకోలేక కత్తెర వాడుతూపోయారట. దాంతో సీరత్ కి సంబంధించిన కొన్ని గ్లామరస్ సీన్స్ సినిమాలో ఉండవని తెలుస్తోంది.

ఓంకార్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా, సమంత, సీరత్ ముఖ్యపాత్రల్లో వస్తున్న ఈ చిత్రం రేపే ప్రేక్షకుల ముందుకి రానుంది. చూద్దాం, ఈ సినిమా అయినా సీరత్ జాతకాన్ని మారుస్తుందో లేదో‌.