ఆ క్యాబ్ డ్రైవర్ ఆమె ఫోటోలు తీసి బలవంతం చేయబోయాడు.! ఆమె తెలివిగా ఎలా తప్పించుకుందో తెలుసా.?     2018-06-06   00:16:19  IST  Raghu V

ఛీ.. ఛీ… ఎన్ని చ‌ట్టాలు తెచ్చినా.. క‌ఠిన శిక్ష‌లు వేస్తున్నామ‌ని చెప్పుకుంటున్నా.. కొంద‌రు ప్ర‌బుద్ధులు మాత్రం ఇంకా నీచ‌మైన ప‌నులు చేయ‌డం మాన‌డం లేదు. ఆడ‌వారు క‌నిపిస్తే చాలు, అస‌భ్య‌క‌రమైన ప‌నులు చేస్తున్నారు. ప‌త్రిక‌ల్లో రాయ‌డానికి, చాన‌ళ్ల‌లో చూపించ‌డానికే సిగ్గు ప‌డేలా అత్యంత నీచ‌మైన ప‌నుల‌కు ఒడిగ‌డుతున్నారు.

మన దేశంలో మహిళలకు స్థానం లేదు. అవును, మీరు విన్నది నిజమే. స్త్రీలు గౌరవించబడే చోట, వారికి మర్యాద దక్కే చోట మాత్రమే వారికి స్థానం ఉంటుంది. అలా మన దేశంలో పరిస్థితులు లేవు. కనుక వారికి మన దేశంలో స్థానం లేదు. ఇప్పుడు మేం చెప్పబోయే సంఘటన వింటే మీరే అలా అంటారు. రేప్‌లు అనేవి నేటి తరుణంలో ఎంత కామన్‌ అయ్యాయంటే.. నేరస్తులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. కానీ వారికి కఠినమైన శిక్షలు పడడం లేదు. పడినా ఎప్పటికో అవి అమలు అవుతున్నాయి. కనుకనే మృగాళ్లు రెచ్చిపోతున్నారు.

బెంగళూరులో ఓ ఓలా క్యాబ్ డ్రైవర్ రెచ్చిపోయాడు. క్యాబ్‌ను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఓ యువతిని లైంగికంగా వేధించాడు. అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. శుక్రవారం (జూన్ 1) రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది