అమెరికాలో అల్లం టీ అమ్ముతుంది..కోట్లు సంపాదిస్తుంది..సంపాదించిన సొమ్మంతా..     2018-08-18   11:42:43  IST  Rajakumari K

క్షణాల్లో నిసత్తువ మాయమై యాక్టివ్నెస్ రావలన్నా… తలనొప్పి చిటికెలో మాయం కావాలన్నా…ఒకటే మందు గరమ్ ఛాయ్..అందులోని అల్లం ఛాయ్ అయితే ఆ మజానే వేరు.. పేరు వింటే చాలు యాక్టివ్ అయిపోతాం..అలాంటి అల్లం ఛాయ్ అమ్మి కోట్లు గడిస్తుంది ఒక మహిళ.మన దేశంలో రుచి చూసిన అల్లం ఛాయ్ రుచి తన దేశంలో,తనుంటున్న ప్రాంతంలో పరిచయం చేయాలనుకుంది..చేసింది..ఛాయ్ టేస్ట్ కి ఫిధా అయిపోయిన వారు ఆమెకి కోట్లు సంపాదన వచ్చేలా చేస్తున్నారు..ఇంతకీ ఎవరామే..ఎక్కడ ఛాయ్ అమ్ముతుంది..

Bruck Eddie Specialist Of Ginger Tea In America,Ginger Tea,Ginger Tea In America

అమెరికాలోని కొల‌రాడో రాష్ట్రంలో ఉండే బ్రూక్ ఎడ్డీ… మ‌హారాష్ట్ర‌లో ఆరంభ‌మైన స్వాధ్యాయ్ ప‌రివార్ అనే కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు 2002లో ఇండియాకు వ‌చ్చింది ఎడ్డీ.స్వ‌త‌హాగా సామాజిక సేవ‌కురాలు అయిన ఎడ్డీ అనేక సేవా కార్య‌క్ర‌మాల్లో పాల్గొని వాలంటీర్‌గా త‌న వంతు సేవ చేస్తుంటుంది. అయితే అలా ఇండియాకు వచ్చిన ఈమెకు మ‌న అల్లం టీ తెగ న‌చ్చేసింది. దీంతో త‌న సొంత దేశానికి వెళ్లాక తాను ఉంటున్న ప్రాంతంలో అల్లం టీని త‌యారు చేసి అమ్మ‌డం మొద‌లు పెట్టింది.అలా బ్రూక్ ఎడ్డీ టీ త‌యారు చేసిన మ‌న అల్లం టీ అక్క‌డి దేశ వాసుల‌కు పిచ్చ పిచ్చ‌గా న‌చ్చేసింది. దీంతో ఎడ్డీ వ్యాపారం బాగానే సాగింది. అలా ఆమె ఏకంగా టీ అమ్మ‌డం ద్వారా 35 మిలియ‌న్ అమెరిక‌న్ డాల‌ర్లు అంటే మన దేశ కరెన్సిలో దాదాపుగా రూ.227 కోట్లు సంపాదించింది

Bruck Eddie Specialist Of Ginger Tea In America,Ginger Tea,Ginger Tea In America

అంత సంపాదించినా ఎడ్డీ ఇప్పటికి సాధారణ జీవితం గడుపుతుంది.. తాను చేసే సమాజ సేవలో భాగంగా GITA (Give, Inspire, Take Action) పేరిట ఓ ట్ర‌స్ట్‌ను ఏర్పాటు చేసి దాని ద్వారా పేద‌ల‌కు స‌హాయం చేస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు బ్రూక్ ఎడ్డీ అలా తాను సంపాదించిన దాంట్లోంచి ఏకంగా 5 ల‌క్ష‌ల డాల‌ర్ల వ‌ర‌కు ఖ‌ర్చు పెట్టింది. గీతా సంస్థ ద్వారా ఆమె త‌న సంపాద‌న‌ను ఎక్కడనుండైతే అల్లం టీ నేర్చుకుని,దాని ద్వారా సంపాదించిందో అదే దేశంలో అంటే మన భార‌త్‌లోని పేద‌ల కోసం ఖ‌ర్చు చేస్తోంది. తాను ఇండియా నుంచి చాలా నేర్చుకున్నాన‌ని, అందుకే ఆ జ్ఞానం వ‌ల్ల వ‌చ్చిన డ‌బ్బును తిరిగి వారి బాగు కోస‌మే వాడుతున్నాన‌ని ఆమె గ‌ర్వంగా చెబుతోంది.