Britain to follow new method to stop children from watching porn

పోర్న్ ఇండస్ట్రీ వారు బిలియన్ల కొద్ది బిజినెస్ చేస్తున్నారు కాని జనాలకే ఈ ఇండస్ట్రీ వలన ఎలాంటి లాభం లేకుండాపోతోంది. ఎందుకంటే శృంగారం గురించి జ్ఞానం ఇవ్వడం లేదు వారు, చండాలమైన కాన్సెప్ట్ లతో ఎంతోమంది జీవితాలని నాశనం చేసున్నారు. ఇందులో ముఖ్యంగా మానసిక ప్రభావం పిల్లల మీద ఎక్కువ పడుతోంది. రియల్ లైఫ్ లో కూడా శృంగారం జీవితం అలానే ఉంటుందేమో, భాగస్వాములు నిజంగానే అలానే శృంగారం చేసుకుంటారేమో అని పొరబడుతున్నారు. కేవలం పిల్లలే కాదు, పెద్దలు కూడా పోర్న్ వలన అసహజమైన ఆలోచనలు, విపరీతమైన కోరికలు పెంచుకుంటున్నారు. మరి అన్ని తెలిసిన పెద్దలే పోర్న్ మాయలో పడిపోతున్నారంటే, ఇక పిల్లలపై ఎలాగో ఆ బ్యాడ్ ఇంపాక్ట్ ఉంటుంది. అందుకే చైల్డ్ పోర్న్ ని అలరెడి నేరంగా ప్రకటించారు ప్రపంచవ్యాప్తంగా. ఇక పిల్లలు పోర్న్ చూడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోబోతోంది బ్రిటన్ గవర్నమెంటు.

ఇకనుంచి ప్రతి పోర్న్ సైట్లో ఒక ఏజ్ వెరిఫికేషన్ సాఫ్ట్ వేర్ ఉండాలంట. అంటే ఊరికే ఓ వార్నింగ్ ఇవ్వడం కాదు, సైట్ ఓపెన్ చేసిన వ్యక్తి వయసు ఏంతో తెలుసుకొని మరి పోర్న్ కంటెంట్ ని అందిచాలంటే వెబ్ సైట్స్. అంటే 18 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న ఏ ఒక్కరికి కూడా పోర్న్ ని అందించకూడదు. కేవలం ఏజ్ వెరిఫికేషన్ సాఫ్ట్ వేర్ ని మాత్రమే కాదు, క్రెడిట్ కార్డు వెరిఫికేషన్ కూడా మొదలుపెట్టనున్నారు. తెలిసిందేగా, 18 ఏళ్ళు దాటితే కాని క్రెడిట్ కార్డు రాదు. క్రెడిట్ కార్డు లేనిదే పోర్న్ ని చూడకుండా చేసే ఆలోచనలో ఉన్నారు. కొత్త రూల్స్ ని త్వరలోనే ఆఫీషియల్ గా ప్రకటిస్తారట. కొత్త రూల్స్ ని పాటించని వారు పోర్న్ వెబ్ సైట్ నడపకుండా చేస్తుంది ప్రభుత్వం. నిజానికి మొదట పోస్ట్ ఆఫీసుల్లో ఏజ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనుకున్నారు కాని దాని కోసం జనాలు పనులు మానుకొని పోస్ట్ ఆఫీస్ చుట్టూ తిరగడం ఎందుకు అని ఈ కొత్త ప్లాన్ వేసారు.

చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ఇంటర్నెట్ సేఫ్టీ చైల్డ్ నెట్, విల్ గార్దేనర్ ఈ విషయం మీద మాట్లాడుతూ “బ్రిటన్ లో మిలియన్ కి పైగా చిన్నపిల్లలు, మైనారిటి లో ఉన్న టీనేజర్స్ పోర్న్ చూస్తున్నారని రిపోర్ట్స్ చెబుతున్నాయి. 8 ఏళ్ల నుంచి 14 ఏళ్ల వయసు ఉండేవారికి కూడా పోర్న్ సులువుగా లభ్యం అవుతోంది. వారిది తెలిసి తెలియని వయసు. వారి సొంత శరీరం గురించి కూడా పూర్తిగా తెలియదు. అలాంటి మనసులని పోర్న్ కలుషితం చేస్తోంది. కాబట్టి తల్లిదండ్రులు ఇంకా బాధ్యతగా వ్యవహరించాలి. కాని అన్నివేళలా అది సాధ్యం కాదు పోర్న్ సైట్స్ కే అ పని అప్పజేప్పుతున్నాం. ప్రతి పోర్న్ సైట్ లో ఏజ్ వెరిఫికేషన్ సాఫ్ట్ వేర్ ఉండాల్సిందే. కేవలం మేజర్ ఏజ్ వచ్చిన వారే పోర్న్ చూడగలాగాలి. అందుకే సాధ్యపడే పనులన్నీ చేస్తాం” అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు.