Breast Milk can show the hidden cancer – Study

రొమ్ములు స్త్రీ శరీరంలో అతిగొప్ప అవయవాలు. ఇవి కామోద్రేక కేంద్రాలు అనే దృష్టితో కాకుండా, మాత్రుత్వపు అనుభవాలు పొందే అవయవాలుగా చూస్తే ఇంకా గొప్పగా కనిపిస్తాయి. కాని వక్షోజాలు బ్రెస్ట్ క్యాన్సర్ అనే పెద్ద ప్రమాదంలో పడటానికి అవకాశం ఉంటుందని మనం చాలాసార్లు చదువుకున్నాం. ప్రతి ఏడాది లక్షలమంది మహిళలు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. అయినా బ్రెస్ట్ క్యాన్సర్ మీద మహిళలకు అవగాహన తక్కువ. ఇలాంటి వ్యాధి ఒక్కటి ఉంటుందని వచ్చేదాకా చాలామందికి తెలియదు. అందుకే బ్రెస్ట్ క్యాన్సర్ మీద అవగాహన పెంచేందుకే సినిమా హీరోయిన్లు కొన్ని కార్యక్రామాలు నిర్వహిస్తుంటారు. దక్షిణాఫ్రికా లాంటి పెద్ద క్రికెట్ జ్జట్టు అప్పుడప్పుడు తమ గ్రీన్ కలర్ జెర్సీకి బదులు పింక్ కలర్ జెర్సీ వేసుకొని బ్రీస్ట్ క్యాన్సర్ మీద అవగాహన కల్పించేందుకు కృషి చేస్తూ ఉంటుంది. ఇంతలా తపన పడుతున్నారు అంటే అర్థం చేసుకొని, ఈ జేనేరేషన్ స్త్రీలకు కూడా దేశాలతో సంబంధం లేకుండా బ్రెస్ట్ క్యాన్సర్ మీద సరైన అవగాహన లేదు అని.