ప్రేమ కోసం అబ్బాయి ధర్నా, అమ్మాయి..!     2018-06-30   00:45:02  IST  Raghu V

సహజంగా అయితే అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అంటూ మోసం చేశాడు అంటూ అమ్మాయిలు ఆందోళనలు చేయడం మనం ఇప్పటి వరకు చూశాం. సమాజంలో ఎక్కువగా అమ్మాయిలు మోస పోవడం చూస్తూ ఉంటాం. ప్రతి రోజు మీడియాలో ఏదో ఒక చోట అమ్మాయిని అబ్బాయి ప్రేమ పేరుతో మోసం చేశాడు అంటూ చదువుతూ ఉంటాం. కాని ఇప్పుడు నేను చెప్పబోతున్న కథనంలో ఒక అబ్బాయి తన ప్రేమను దక్కించుకునేందుకు పోరాటం చేస్తున్నాడు. కులాల పేరుతో తమ ప్రేమను విడదీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ అతడు ఆందోళనకు దిగుతున్నాడు.

నిజామాబాద్‌ జిల్లా వ్పేూర్‌ మండలం పడగల్‌కు చెందిన ఒక యువకుడు అమ్మాయి ఇంటి ముందు ధర్నాకు దిగాడు. ఏడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న తమను విడదీసి అమ్మాయికి వేరే పెళ్లి చేయబోతున్నారు అంటూ అతడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పది సంవత్సరాలుగా ఈ యువకుడికి ఆ అమ్మాయితో పరిచయం ఉందట. ఏడు ఏళ్లుగా ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు కొన్నాళ్ల పాటు సహజీవనం కూడా చేయడం జరిగిందట. ఇద్దరి సహజీవనంను వివాహంగా మ్చుకోవాలని అతడు భావించాడు.