ఫొటోలు తీసేశానన్నాడు...కానీ చివరికి స్రవంతి భయపడినట్టే జరిగింది.! ఏమైందంటే.?     2018-06-28   22:01:37  IST  Raghu V

స్రవంతి భయపడినట్లే చేశాడతను. అందుకే ఏ ఫోన్‌ మోగినా వణికిపోయింది. విదేశాల్లో ఉద్యోగం చేస్తోన్న తన కూతురు ఆ పరిస్థితుల్లో ఏం చేసుకుంటుందోనని భయపడిపోయారు ఆమె తల్లిదండ్రులు. కానీ అలానే కుంగిపోతే ఏదైనా జరగొచ్చు. అందుకే స్రవంతి తల్లి ధైర్యం చేసింది. కూతురికి హాని తలపెట్టాలనుకున్న అతడిని హెచ్చరించింది. ఆ సమయంలో అతడు కాస్త వెనక్కి తగ్గినా ప్రమాదం మాత్రం లేకపోలేదని ఊహించింది. ఇలాంటి పరిస్థితి తమ కూతురికే కాదు..మరే ఆడపిల్లకీ జరగకూడదనుకుంది ఆ తల్లి. అందుకే సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ విభాగంలోని పోలీసుల్ని సంప్రదించింది. అసలు ఏం జరిగిందీ… స్రవంతి ఎవరు… అతను ఆమెకి ఎలాంటి హాని తలపెట్టాలనుకున్నాడు… పోలీసులు దాన్నెలా పరిష్కరించారు… ఆ వివరాలే చెబుతున్నారు సైబరాబాద్‌ డీసీపీ జానకీషర్మిల.

స్రవంతి హైదరాబాద్‌లోని ఓ కాలేజీలో హొటల్‌మేనేజిమెంట్‌ పూర్తి చేసింది. అక్కడ చదువుతున్నప్పుడే పరిచయం అయ్యాడు అతను. పేరు రాజు. ప్రేమించానంటూ వెనక తిరిగేవాడు. మొదట్లో ఆమె ఏమాత్రం పట్టించుకోలేదు. కానీ అతడు వదిలిపెట్టలేదు. పదే పదే తన ప్రేమను వ్యక్తం చేసేవాడు. కొన్నాళ్లకి ఆమె అతడి ప్రేమని ఒప్పుకుంది. అది చనువుకు దారితీసింది. దాంతో ఇద్దరూ తమకు సంబంధించిన వ్యక్తిగత చిత్రాలను వాట్సప్‌లో పంచుకున్నారు. అయితే వారి బంధం ఎక్కువ కాలం నిలబడలేదు. అతడిలోని మరో రూపం ఆమెకు తెలియడంతో దూరంగా ఉండటం మొదలుపెట్టింది.