బాలకృష్ణ, మహేష్ .. ఇద్దరికీ కోపం తెప్పించిన ఎన్టీఆర్    2017-06-26   23:42:20  IST  Raghu V

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న “జై లవ కుశ” షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి అయ్యేలా లేదు. దీంతో ఆగష్టులో రావాల్సిన సినిమా కాస్త సెప్టెంబరు మొదటివారానికి తీసుకురావాలనుకున్నారు. జనతా గ్యారేజ్ కూడా గత ఏడాది ఇదే సమయానికి వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. కాని మళ్ళీ ఏమైందో, జై లవ కుశ మరోసారి వాయిదాపడుతూ సెప్టెంబరు 21 తేదికి షిఫ్ట్ చేసారు. ఈ నిర్ణయంతో ఇటు బాలకృష్ణకి, అటు మహేష్ బాబుకి .. ఇద్దరికి పెద్ద తలనొప్పిగా మారాడు తారక్.

ఎందుకంటే స్పైడర్ అయితే సెప్టెంబరు 21, లేదా 27వ తేదిన రాబోతోంది. ఇక బాలయ్యబాబు నటించిన పైసా వసూల్ సెప్టెంబరు 28న వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికి మహేష్ తో పోటి ఉంది అంటే కొత్తగా ఎన్టీఆర్ వచ్చి చేరాడు. పోటి రసవత్తరంగా ఉంటుందేమో కాని ఏ సినిమా కూడా పూర్తి స్థాయిలో లాభపడకపోవచ్చు. పండగ అన్నాక రెండు పెద్ద సినిమాలు పోటిపడటం ఓకే కాని ఇలా మూడు పెద్ద సినిమాలు గ్యాప్ లేకుండా రావడం బయ్యర్లకు మంచిది కాదు. ఇందులో తేడా కొడితే అందరికన్నా ఎక్కువ నష్టపోయేది మహేషే.

130 కోట్ల బిజినెస్ (కేవలం థియేట్రికల్) చేస్తోంది స్పైడర్. ఈ మొత్తం రికవర్ అవ్వాలంటే మామూలు మాటలా? రెండు పెద్ద సినిమాలు ఉంటే మహేష్ కి సరిపడా థియేటర్స్ ఎక్కడ దొరుకుతాయి? మరోవైపు బాలకృష్ణ కూడా ఎన్టీఆర్ నిర్ణయం పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఆయన గత చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి టాక్ తెచ్చుకున్నా, ఖైదీనం 150తో పోటి వలన అనుకున్నంతగా కలెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఖైదీ లాంటి సినిమాలు రెండు ఉంటాయి పోటిలో. దాంతో బాలకృష్ణ కష్టాలు ఈసారి రెండింతలు అయినట్టు.

ఈ త్రీవే పోటి నుంచి కనీసం ఒక్క సినిమా అయినా తప్పుకుంటేనే మేలు ఏమో. మన నిర్మాతలు ఎలాగో హక్కుల రేట్లు తగ్గించరు, కనీసం ఇలా పోటీలకు వెళ్ళకపోతే పంపిణీదారులకి ఎంతోకొంత మిగులుతాయి.