Boss in Houston attaches nude pics everyday to keep his employees active

మనిషికి తిండి అయినా బోరు కొడుతుందేమో కాని, నిద్ర మాత్రం అస్సలు బోర్ కొట్టదు. నిజానికి మనిషికి బోర్ కొట్టినప్పుడే నిద్ర వస్తుంది.. ఇక నిద్ర బోర్ కొట్టడం ఏమిటి ! ఇక మోడ్రన్ మనుషులకి నిద్ర ఎక్కువగా ఎక్కడ వస్తుంది అంటే, అది ఆఫీసు లేదా కాలేజి, స్కూల్లోనే. బేసిక్ గా మనిషికి ఒళ్ళు వంచాలంటే బద్ధకం. కంప్యూటర్ యుగంలో శారీరక శ్రమ తక్కువై ఆ బద్ధకం రోజురోజుకి మరింత పెరుగుతోంది తప్ప తగ్గట్లేదు. అలాగే మెదడుకి పనిచెప్పే పని కూడా తగ్గడంతో నిద్ర ముంచుకొస్తూ ఉంటుంది. అందుకే ఆఫీసుల్లో, స్కూల్స్ లో, కాలేజీల్లో నిద్రపోతుంటారు.

ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే హౌస్టన్ లో ఒక చిన్న బిపిఓ కంపెనీ ఉంది. అందులో పనిచేసేవారంతా మగవారే. అలా ఎందుకు అంటే, ఆడవారైతే మెటర్నిటి లీవ్ అని, ఆ లీవ్ అని సనపెడతారని, కేవలం మగవారినే తీసుకుంటున్నాడు ఆ బాస్. కాని మరో సమస్య వచ్చింది. పనితనం ఉన్నవారే దొరికారు కాని నిద్రకి తట్టుకోలేకపోతున్నారు నైట్ షిఫ్ట్ లో పనిచేసేవారు. పార్ట్ టైమ్ జాబ్స్ కదా, మళ్ళీ నైట్ షిఫ్ట్స్, నిద్ర తట్టుకోవడం కష్టమే.