రంగస్థలం ఐటెం సాంగ్ కోసం బాలీవుడ్ టాప్ హీరోయిన్  

టాలీవుడ్ లో మాములుగా వచ్చే సాంగ్స్ కంటే కూడా..ఇప్పుడు ఐటెం సాంగ్స్ కి మాంచి ఆదరణ ఎక్కువగా ఉంది. ఒక స్టార్ హీరో సినిమాలో హీరోయిన్ ఎవరు అని అడగటం లేదు ఎవ్వరూ ఐటెం సాంగ్ చేసేది ఎవరు అని అడుగుతున్నారు..నిర్మాతలు కూడా టాప్ హీరోయిన్స్ తో ఐటెం సాంగ్స్ చేయిస్తున్నారు..దానికి తగ్గట్టుగా పారితోషకం కూడా బాగానే ఇస్తున్నారు..దీంతో ఐటెం సాంగ్స్ క్రేజ్ పెరిగిపోయింది.

ఇప్పుడు టాలీవుడ్ మెగా హీరో సినిమాలో ఐటెం సాంగ్ లో ఎవరు దర్శనం ఇవ్వబోతున్నారు అనేది హాట్ టాపిక్ అయ్యింది. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌, మరో స్టార్‌ హీరో భార్య కరీనా కపూర్‌ టాలీవుడ్‌లో ఓ ఐటెంసాంగ్‌ చేయబోతోంది.. ఇది కొద్దిగా నమ్మశక్యం కాని వార్తే అయినా సోషల్‌ మీడియాలో బాగా హల్‌చల్‌ చేస్తోంది. తల్లి అయిన తరువాత కరీనా తిరిగి తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ని మొదలెట్టే ప్రయత్నాల్లో చాలా బిజీగా ఉంది. ఇందుకోసం తన మునుపటి నాజూకు సొంపులకోసం తెగ కష్టపదిపోతొందట.

“రగస్థలం” ఐటెం సాంగ్ లో చేయడానికి ఆమెతో చిత్రయూనిట్ చర్చలు జరిపారట..దానికోసం దర్శక నిర్మాతలు వెళ్లి అడుగగా ఆమె భారీమొత్తం అడగటంతో షాక్ అయిన ఇద్దరూ సినిమాకి ఉన్న క్రేజ్ లో ఇప్పుడు కరీనా ఐటెం లో చేయడం వలన మరింత హైప్ క్రియేట్ అవుతుంది అని భావించారట..అందుకే ఒకే చెప్పేశారట. హీరోయిన్‌గా బాలీవుడ్ భామలు ఇక్కడ సక్సెస్ అవ్వకపోయినా..ఇలా ఐటెం సాంగ్స్ లో మటుకూ ఇక్కడి ప్రేక్షకులకి గుర్తుఉండిపోతారు. మరి కరీనా టాలీవుడ్ ఐటెం ఎంట్రీ సాంగ్ ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.