అమ్మాయిలతో లిప్ కిస్ కి రెడీ అంటున్న స్టార్ హీరోయిన్  

తనకు కథ, పాత్ర నచ్చాలే కాని, సినిమా కోసం ఎంత దూరమైన వెళ్ళే నటి విద్యబాలన్. డర్టీ పిక్చర్ వరకు ఎప్పుడూ గ్లామర్ పాత్రలే వేయలేదు విద్య. కాని డర్టీ పిక్చర్ తాను పోషించేది ఒక ఐటమ్ గర్ల్ పాత్ర‌. అందులోనూ దక్షిణాదిని ఒక ఊపు ఊపిన సిల్క్ స్మిత పాత్ర. అందుకే పాత్ర కోసమే గ్లామర్ బాట పట్టింది. రిస్క్ ఫీల్ అవకుండా లావెక్కింది. ఆ తరువాత కూడా స్క్రిప్ట్ లో సన్నివేశాల అవసరం మేరకు స్కిన్ షో, లిప్ లాక్స్ చాలానే చేసింది విద్య. మరి వృత్తి పట్ల ఇంత కమిటెడ్ గా ఉండే విద్య కథ డిమాండ్ చేస్తే అమ్మాయితో లిప్ లాక్ కి సిద్ధం అంటుందా? ఆమెని ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న అడిగారు.

దానికి సమాధానం చెబుతూ, తానేమి అమ్మాయిల పట్ల ఆకర్షితురాలయ్యే మహళను కాదని, స్ట్రేయిట్ స్త్రీల లానే, పురుషులతోనే ఇంటిమేసికి ఆసక్తి చూపెట్టినా, స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే లెస్బియన్ సన్నివేశాలకు అభ్యంతరం చెప్పనని, మరో అమ్మాయిని ముద్దుపెట్టుకోవడంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పింది విద్య.

మరి ఏ హీరోయిన్ ని ముద్దుపెట్టుకోవడానికి ఇష్టపడతారు అని అడిగితే, తెలివిగా బాలివుడ్ హీరోయిన్ల పేర్లు చెప్పకుండా ముగ్గురు హాలివుడ్ హీరోయిన్ల పేర్లు చెప్పింది. ఆ ముగ్గురే ఎమ్మా స్టోన్, సల్మా హాయెక్ మరియు పెనెలోప్ క్రజ్.

ఇక భారతీయ సినిమాల్లో లెస్బియన్ సన్నివేశాల విషయానికి వస్తే, షబానా ఆజ్మీ, నందితా సేన్, కల్కి కొచ్లీన్, పావోలి డామ్, సన్నిలియోన్, స్వస్తిక ముఖర్జీ వంటి నటీమణులు లెస్బియన్ సన్నివేశాల్లో నటించారు.