“ఆరునెలల” పసిగుడ్డు పై హత్యాచారం చేసి ఆపై..     2018-04-21   02:50:22  IST  Raghu V

దేశంలో రానురాను హత్యాచారాల శాతం ఎక్కువై పోతోంది..ముక్కు పచ్చలారని చిన్న పిల్ల నుంచీ ముసలి వయసు వచ్చిన మహిళలపై కూడా హత్యచారాలు పెరిగిపోతున్నాయి..15 ఏళ్ల బాలురు కూడా హత్యచారాలకి పాల్పడుతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి..ఎన్ని ఘటనలు జరుగుతున్నా సరే ప్రభుత్వాలు తీసుకునే చర్యలు ఎవరికీ కూడా సరైన శిక్షలు పడక పోవడంతో ఎవరికీ వారు బరితెగించి పోతున్నారు..

గత వారం రోజుల్లో జరిగిన సంఘటనలే ఇందుకు సాక్ష్యం.. మొన్న ఎనిమిదేళ్ళ పాప హత్యచార ఘటనలో దేశం అట్టుడికి పోయిన విషయం అందరికీ తెలిసిందే ఆ విషయం మరువక ముందే మరొక సంఘటన దేశాన్ని కుదిపేస్తోంది..ఆరు నెలల చిన్న పసిగుడ్డుపై జరిగిన హత్యాచార సంఘటన ఇప్పుడు దేసవ్యప్తంగా సంచలనం సృష్టిస్తోంది..వివరాలలోకి వెళ్తే..

మధ్యప్రదేశ్‌లో తల్లి పక్కనే నిద్రిస్తున్న ఆరు నెలల పసికందును ఎత్తుకెళ్లిన ఓ దుర్మార్గుడు ఆ పసి గుడ్డుపై లైంగిక దాడికి పాల్పడ్డాడు అక్కడితో ఆగకుండా ఆచిన్నారిని చంపేశాడు ఈ సంఘటన ఇండోర్‌లో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది.