పసుపు + మిరియాలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు     2018-06-11   23:31:59  IST  Lakshmi P

పసుపును మన ఇంటిలో ప్రతి రోజు వంటల్లో ఉపయోగిస్తాం. అలాగే పసుపును మన పూర్వీకుల కాలం నుండి వాడుతున్నారు. పసుపు కారణంగా వంటలకు మంచి రంగు,రుచి వస్తాయి. అంతేకాక ఎన్నో ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరగటానికి సహాయపడుతుంది. ఇక మిరియాల విషయానికి వస్తే మిరియాలతో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ సెప్టిక్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉండుట వలన అనేక ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది. ఇన్ని మంచి లక్షణాలు ఉన్న పసుపు,మిరియాలను కలిపి తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుంటే చాలా ఆశ్చర్యపోతారు.

పసుపు,మిరియాలను కలిపి ప్రతి రోజు తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అంతేకాక క్యాన్సర్ కారకాలను నియంత్రిస్తుంది.