పసుపు + మిరియాలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు     2018-06-11   23:31:59  IST  Lakshmi P

ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో చికికేడు పసుపు,మిరియాల పొడిని కలిపి తీసుకుంటే నొప్పులు తగ్గుతాయి. వాటిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు నొప్పులను తగ్గించటంలో కీలకమైన పాత్రను పోషిస్తాయి.

పసుపు,మిరియాల కాంబినేషన్ రక్తంలో చక్కర స్థాయిలను తగ్గించి మధుమేహంను అదుపులో ఉంచుతుంది. కాబట్టి మధుమేహం ఉన్నవారు ప్రతి రోజు కక్రమం తప్పకుండా పసుపు,మిరియాల పొడిని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

బరువు తగ్గాలని అనుకొనే వారికి ఈ కాంబినేషన్ మంచి ఔషధం అని చెప్పవచ్చు. ప్రతి రోజు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిట్లో అరస్పూన్ పసుపు,అరస్పూన్ మిరియాల పొడి కలిపి పరగడుపున త్రాగితే శరీరంలో కొవ్వు కరిగిపోయి బరువు తగ్గుతారు.