నల్ల జీలకర్రను మూటకట్టి వాసన పీలుస్తుంటే ఏమౌతుందో తెలుసా ?     2017-10-20   21:47:03  IST  Lakshmi P

Black cumin seeds health benefits in telugu

వానాకాలం వచ్చిందంటే చాలు జలుబు,దగ్గు సమస్యలు వేధిస్తూ ఉంటాయి. ఈ సమస్యలు ఎక్కువైతే తల డిమ్ముగా ఉండి ఏ పని మీద ఏకాగ్రత్త ఉండదు. ఈ సమస్య తగ్గాలంటే ఇంగ్లిష్ మందులు అంతగా పనిచేయవు. ఒకవేళ వాడిన ఆ యాంటీ బయటిక్ మందుల కారణముగా మన శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. అందువల్ల జలుబు తగ్గటానికి మన ఇంటిలో ఉండే వస్తువులతో సులభంగా తగ్గించుకోవచ్చు. ఈ ఇంటి చిట్కాలను పాటించటం వలన ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు.

చిటికెడు పసుపు, చిటికెడు శొంఠి పొడిని తేనెలో కల్పి తీసుకుంటే దగ్గు తగ్గటమే కాకుండా జలుబు కారణంగా వచ్చే తలనొప్పిని కూడా తగ్గిస్తుంది.


అల్లం రసంలో తేనే కలిపి తీసుకుంటే దగ్గు,జలుబు నుండి ఉపశమనం కలుగుతుంది

ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ మిరియాల పొడి,సరిపడా బెల్లం వేసి మరిగించాలి. ఈ కాషాయం చల్లారాక త్రాగితే దగ్గు,జలుబు నుండి మంచి ఉపశమనం కలుగుతుంది.

ఒక గ్లాస్ పాలలో చిటికెడు పసుపు వేసుకొని రాత్రి పడుకొనే ముందు త్రాగితే మంచి ఉపశమనం కలుగుతుంది

పసుపు కొమ్మును కాల్చి ఆ వాసనను పీల్చితే ముక్కు దిబ్బడ తగ్గుతుంది