నలుపు రంగును ఎందుకు అశుభంగా భావిస్తారు?     2018-05-26   23:38:00  IST  Raghu V

మనలో చాలా మంది నలుపు రంగును అశుభంగా భావిస్తారు. అలాగే నల్లగా ఉన్నవారిని కాస్త చిన్నచూపు కూడా చూస్తారు. వర్ణ శాస్త్రం ప్రకారం అన్ని రంగులు కలిస్తేనే నలుపు రంగు అవుతుంది. అలాగే నలుపు రంగు హుందాతనాన్ని,అధికారాన్ని సూచిస్తుంది. విష్ణు మూర్తి అవతారాలు అయినా రాముడు,కృష్ణుడు వంటి అవతార పురుషులే కాకుండా శకుంతల,ద్రౌపతి వంటి వారు కూడా మేని ఛాయ తక్కువ ఉన్నవారే. అయ్యప్ప మాల వేసుకున్నవారు కూడా నలుపు దుస్తులను వేసుకుంటారు.

కొన్ని ప్రాంతాల్లో అమ్మవారికి నల్లని చీరను కడతారు. అంతేకాక అమ్మవారికి నల్లని చీరను,గాజులను ఇచ్చి ఆ తరవాత వాటిని భక్తులు చీరను కట్టుకొని నల్లని గాజులను వేసుకుంటారు. అయితే చాలా మంది నలుపును అశుభంగా పరిగణిస్తారు. దానికి ఒక కారణం ఉంది.