పవన్ హడావిడి వెనుకాల కేంద్రం భారీ కుట్ర..     2018-04-27   02:09:24  IST  Bhanu C

మీడియాపై పవన్ దాడి వెనుకాల చంద్రబాబు టార్గెట్ ఎలా అవుతాడు..? కేంద్రం కి పవన్ మీడియాని బ్యాన్ చేయమనడానికి చంద్రాబు పై కుట్రకి అసలు ఏమిటి సంభంధం ఆలోచిస్తుంటే ఏమీ అంతుబట్టడం లేదు కదా..అవును రాజకీయాలలో ఒక నాయకుడు కానీ పార్టీ కానీ ఒక గేమ్ మొదలు పెడితే దాని పర్యవసానం ఎప్పుడు ఎలా ఉంటుందో ..ఎవరిపై ఆ ప్రభావం చూపిస్తుందో ఎవరికీ తెలియదు..చివరకి రిజల్ట్స్ వచ్చేసరికి అంతా అయిపోతుంది…అసలు వివరాలలోకి వెళ్తే..

శ్రీ రెడ్డి ఇష్యూ తరువాత పవన్ కళ్యాణ్ కొంత సైలెంట్ గా ఉన్నాడు అయితే ఎప్పుడు చంద్రబాబు ని టార్గెట్ చేయాలో సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ కి శ్రీ రెడ్డి ఇష్యూ చాలా హెల్ప్ అయ్యింది..తన తల్లిని దూషించారు అంటూ పవన్ కళ్యాణ్ మీడియాని టార్గెట్ చేయడం ఫిల్మ్ ఛాంబర్ లో తెగ హడావిడి చేసేయడం అంతా చంద్రబాబు ని ఇరకాటంలోకి నేట్టేయడానికి వేస్తున్న పక్కా స్కెచ్..చంద్రబాబు ముందు నుంచే కేంద్రం నాపై కుట్ర పన్నుతోంది టీడీపి శ్రేణులు అలెర్ట్ గా ఉండాలి అంటూనే ఉన్నారు..అయితే చంద్రబాబు ని టార్గెట్ చేయడం కోసం కేంద్రం పవన్ ని పావుగా వాడుతోంది అనేది గతకొన్ని రోజులుగా జరుగుతున్నా పరిణామాలే నిదర్శనం..

విభ‌జ‌న హామీల‌ను అమ‌లు చేయ‌డంలో కేంద్రంలోని మోడీ ప్ర‌భుత్వం పూర్తిగా ఫెయిల్ అయ్యిందని మొదటి నుంచీ కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ వస్తున్న చంద్రబాబు ఆ క్రమంలోనే హామీల అమలుకోసం విజయవాడలో దీక్ష చేపట్టిన చంద్రబాబు కేంద్రలో వణుకు పుట్టించారు అయితే ముందుగానే రచించుకున్న పధకం ప్రకారం పవన్ హైదరాబాదు లో మీడియాపై విరుచుకు పడ్డారు..చంద్రబాబు దీక్షని పక్కదోవ పట్టిచారు ఆ తరువాత కేంద్రం వేసిన స్కెచ్ ని అమలు చేయడం మొదలు పెట్టారు..