టీడీపీ ని దెబ్బకొట్టడానికి బీజేపీ కుట్ర..? వైసీపీ జనసేనలతో స్కెచ్ !     2018-05-30   01:20:05  IST  Bhanu C

ఏపీలో బలంగా ఉన్న టీడీపీని దెబ్బకొట్టేందుకు బీజేపీ అనేక ఎత్తులు.. పైఎత్తులు వేస్తోంది. ఏదో రకంగా టీడీపీని దెబ్బకొట్టి ఏపీలో పాతుకుపోవాలని చూస్తోంది. అయితే అందుకు తగ్గ బలం ఆ పార్టీకి లేనందున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జనసేనలను దగ్గరకు చేరదీసి వాళ్ళ ద్వారా టీడీపీ ని బలహీనపరచాలని చూస్తోంది. అందుకే బీజేపీ ముఖ్యం గా మూడు ప్లాన్స్ తో ముందుకు వచ్చింది. ఒకటి జగన్ పవన్ లని కలిపి ఒక కూటమిగా ఎన్నికలకు వెళ్ళటం , రెండు వైసీపీతో పొత్తు పెట్టుకోవటం, మూడు అవినీతి వైసీపీ ని పూర్తిగా పక్కన పెట్టి జనసేనని దగ్గర చేసుకోటం వంటి ప్లాన్లు బీజేపీ వేస్తోంది.

అయితే జగన్ పక్కనపెట్టే కంటే… పవన్ ని జగన్ కలిపి రెడ్డి కాపు సామాజిక వర్గ ఓట్లు దగ్గర చేసుకుంటే విజయం సులువు అని భావిస్తున్నట్టు గ వార్తలు వస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఓనమాలు దిద్దటం మొదలుపెట్టారు. ఉత్తరాంధ్ర నుంచి ఆయన తన రాజకీయ యాత్ర మొదలుపెట్టారు. అయితే ఇక్కడ ఆయన వ్యూహం ఏంటి అనేది చాలా మందిలో ఒక ఆసక్తికర చర్చకు తెరతీసింది. ఉత్తరాంధ్రలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న కాపు సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడానికి తన ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నేపధ్యంలోనే ఆయన అక్కడి నుంచి తన పోరాట యాత్రకు శ్రీకారం చుట్టారు. అయితే ఇక్కడే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ జగన్ పార్టీతో పవన్ పార్టీ బిజెపి ఆదేశాల అనుసారం పొత్తు పెట్టుకుంది అనే అభిప్రాయం వినపడుతుంది.