బీజేపీ అంతపని చేయబోతోందా ..? ఏపీలో అవినీతిపై సీబీఐ కి ఫిర్యాదు చేస్తారా ..?     2018-06-16   04:12:55  IST  Bhanu C

బీజేపీ టీడీపీకి మధ్య రాజకీయ వైరం వచ్చినప్పటి నుంచి ఇరు పార్టీల మధ్య రాజకీయ వైరం తారాస్థాయికి చేరింది. ఒకరి లూప్ హొల్స్ మరొకరు బయటపెట్టుకుంటూ.. రచ్చ రచ్చ చేసుకుంటున్నారు. అలాగే ఏపీలో టీడీపీ ప్రభుత్వం అవినీతి చేస్తోందని.. వైసీపీ, జనసేన కూడా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే… ముఖ్యంగా సీఎం చంద్రబాబు పథకాలు అన్ని కేంద్రం నుంచి నిధులు వచ్చిన వాటికి కూడా చంద్రన్న పథకాలుగా ప్రచారం చేసుకున్నారని, ఏపీకి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చినా అన్నింటిని ఏపీ సర్కారు ఖాతాలో తెలుగుదేశం పార్టీ వేసుకుంది అని బీజేపీ ప్రధాన ఆరోపణ.

గతంలో టీడీపీ- బీజేపీ పొత్తు ఉండడంతో ఇది పెద్దగా పట్టించుకోలేదు. కానీ పరిస్థితి మారడంతో.. ఇప్పుడు ఏవ్ అంశాలపై బీజేపీ గుర్రుగా ఉంది. అలాగే.. ఏపీలో తెలుగుదేశం పార్టీ పై ఎన్ని విమర్శలు వస్తున్నా వాటిని తిప్పికొట్టడంలో తెలుగుదేశం నాయకులు విఫలం అయ్యారు.