డిసెంబర్ లో ఏపీలో కీలక మార్పులు..ఆపరేషన్ “గరుడ క్లైమ్యాక్స్”     2018-06-08   23:17:24  IST  Bhanu C

రాష్ట్ర రాజకీయలలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయా..? ఎవరూ ఊహించని పరిణామాలు త్వరలో ఏపీ ప్రజలు చూడబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు..ఏపీలో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఏ పార్టీ ఎవరితో జట్టుకడుతుందో చివరి వరకూ చెప్పలేని పరిస్థితి ఒక పక్క ఆపరేషన్ గరుడ జోరుగా సాగిపోతుంటే మరో పక్క లోకల్ పాలిటిక్స్ ఎన్నో ట్రిక్స్ ప్లే చేస్తూ వడివడిగా అడుగులు వేస్తున్నాయి..ఈ పరిణామాలతో నేతల్లో టెన్షన్ పెరిగిపోతుంటే ప్రజలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తూ పరిస్థితులని గమనిస్తున్నారు అయితే…

డిసెంబర్ లో ఏపీ లో జరుగబోయే పరిణామాలు మాత్రం కీలక మార్పులని తీసుకురాబోతున్నాయి అంటున్నారు విశ్లేషకులు..తాజా సమాచారం ప్రకారం..ఏపీలో డిసెంబర్ లో ఒకే వేదికపైకి పవన్ ,జగన్ చేరి ఒక కీలక ప్రకటన చేయనున్నారట…అంతేకాదు అదే వేదికపైకి మోడీ సైతం హాజరయ్యి జగన్ పవన్ ల ధైర్య సాహసాలని ప్రజలకి చెప్తూ ఏపీ పై వారాల జల్లులు కురిపించానున్నారని..అప్పటివరకూ మోడీ పై బీజేపి పై గుర్రుగా ఉండే ప్రజలు ఆ వారాలకి ఫిదా అయిపోవడం ఖాయం అంటున్నారు..