“చంద్రబాబు” కి “జేవీఎల్” ఘాటు హెచ్చరిక..     2018-05-10   23:41:29  IST  Bhanu C

ఏపీ సీఎం చంద్రబాబు పై బీజేపి నేతలు తీవ్రమైన స్థాయిలో మండిపడుతున్నారు కొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో చంద్రబాబు పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు షాకింగ్ కామెంట్స్ చేయడం ఎంతో సంచలనంగా మారింది…కర్ణాటక ఎన్నికల నేపధ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు అక్కడ బీజేపి లో వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించడంతో తీవ్ర ఆగ్రహంగా ఉన్న బీజేపి జీవీఎల్ నరసింహారావు ద్వారా చంద్రబాబుకి వార్నింగ్ ఇచ్చింది..వివరాలలోకి వెళ్తే…

ఒక పక్క కర్ణాటక ఎన్నికలతో తమ సత్తా చాటి చెప్పాలని చూస్తున్న బీజేపికి చంద్రబాబు చెక్ పెట్టే విధంగా వ్యుహరచనలు చేయడంతో ఇక ఉపేక్షించేది లేదని తేల్చిన బీజేపి బాబు కి వార్నింగ్ లు ఇవ్వడం మొదలు పెట్టింది…ఈ దశలోనే జీవీఎల్ నరసింహారావు షాకింగ్ కామెంట్స్ చేసారు. చంద్రబాబు ఎన్ని కుయుక్తులు పన్నినా కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ పార్టీ గెలుపును ఆపలేరు అని అన్నారు…కర్ణాటక రాష్ట్రంలో ప్రధాని మోడీకి తెలుగు ప్రజలు నీరాజనం పట్టారని దాంతో చంద్రబాబు కి మతిపోయిందని పేర్కొన్నారు.