ఆపరేషన్ గరుడ చివరి ఘట్టం ఇదేనా..జీవీఎల్ షాకింగ్ స్టేట్మెంట్     2018-06-18   03:15:30  IST  Bhanu C

ఏపీ రాజకీయాలు మొన్నటి వరకూ ఒకెత్తు నిన్నటి వరకూ ఒకెత్తు లా మారిపోయాయి..బీజేపి , జగన్ , జనసేన కూటమి ఏపీలో సక్సెస్ అవుతుందని ఈ దెబ్బతో చంద్రబాబు దెబ్బకి కుదేలు అవుతాడు ఏపీలో తెలుగుదేశం పార్టీని సోది లోకి లేకుండా చేస్తామని చెప్పిన బీజేపి కి లగడపాటి రాజగోపాల్ సంస్థ ఆర్జీస్ ఫ్లాష్ టీం జరిపిన సర్వే ఫలితాలు చూసి దిమ్మతిరిగిపోయింది రాజగోపాల్ సర్వే అంటే రాజకీయపార్టీలలో చాలా నమ్మకం ఉంటుంది.. లగడపాటి సర్వే కి తిరిగు ఉండదు అని ఎన్నో సార్లు రుజువయ్యింది కూడా..అయితే ఇదే క్రమంలో బీజేపి ఎంపీ జీవీఎల్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి..

అయితే ఇప్పుడు ఈ సర్వే ప్రభావం పార్టీలపై పడకుండా చేసేందుకు బీజేపి నష్ట నివారణ చర్యలు చేపడుతోంది.. అందుకే జీవీఎల్ నరసింహారావు రంగంలోకి దిగారు. ప్రెస్ మీట్ పెట్టారు ఒక్క శాతం ఓట్లు వచ్చినా సరే బీజేపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతుందని తేల్చి చెప్పారు..నేను చెప్పేది వాస్తవం ఒక్క సాటి ఓట్లు పోలినా సరే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అని తెలిపారు…ఈ కుమ్మక్కు సర్వే చూసి సంతోష పడకండి వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలిచినా.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయబోరని హెచ్చరించారు.