ఏపీలో హీట్ పుట్టిస్తున్నరాజకీయం...మేధావులకి అర్థం కాని బీజేపి వ్యూహాలు...    2018-06-20   00:28:46  IST  Bhanu C

ఏపీలో రాజకీయాలు చూస్తుంటే సామాన్యుడి కి బుర్ర హీట్ ఎక్కిపోతోంది..చోటా మోటా రాజకీయ నేతలకి జుట్లు పీక్కునే పరిస్థితి నెలకొంది…ఏ పార్టీ ఎవరితో జట్టు కడుతుంది అనే విషయం ఇప్పటికిప్పుడు ఎవరూ అంచనా వేయలేక పోతున్నారు..మొన్నటి వరకూ ఏపీలో టీడీపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది.బీజేపి , వైసీపి, జనసేన కలిసి పోటీ చేస్తాయి..చంద్రబాబు పని కేల్ ఖతం దుకాణ్ భంద్ అని అన్నారు..చంద్రబాబు ఇక రాజకీయాలకి సెలవు ప్రకటించడం మంచిది అనే వార్తలు హల్చల్ చేశాయి..అయితే రాజకీయాల్లో ఏది ఎప్పుడు ఎలా ..ఏ టైం లో జరుగుతుందో ఎవరి తెలియని పరిస్థితి అయితే ఇప్పుడు అదే జరిగింది..

ఏపీలో అసలు ఏపీలో ఏమి జరుగుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి… బీజేపి , వైసీపి, జనసేన ఈ మూడు పార్టీలు కలిసి పని చేస్తాయి అనుకున్న తరుణంలో సీన్ రివర్స్ అవుతోంది..ఇప్పుడు బీజేపి పెద్దలు యూ టర్న్ తీసుకోబోతున్నారా అనే అనుమానాలకి బలం పెరుగుతోంది..చంద్రబాబు ఒంటరే అని అందరూ అనుకున్న సమయంలో ఎంతో మంది మేధావులు బాబు చివరి నిమిషంలో ఏదైనా చేయగల అపర చాణిక్యుడు అని అన్నారు నిజంగా బాబు ఎదో మాయ చేసే ఉంటారు అంటున్నారు మేధావులు బీజేపి నేతల స్వరంలో తేడా వచ్చింది అంటున్నారు..బీజేపి తెలుగుదేశం భంధం మరోసారి బలపడుతుందా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు..

అయితే ఈ సందేహాలకి బీజేపి నేతల ప్రవర్తన మాటలు మరింత అనుమానలకియా తావిస్తోంది..జగన్ శిబిరానికి ఘలక్ ఇస్తోంది…మొన్న నీతీ ఆయోగ్ భేటీలో భాగంగా చంద్రబాబు ఇతర నేతలు టీ విరామసమయంలో ఉండగా నేరుగా మోడీ వచ్చి బాబుతో ముచ్చటించడం..అదే సమయంలో జరుగుతున్న మీటింగ్ లో చంద్రబాబు ని పొగడ్తలతో ముంచెత్తడం..బాబు పాలన బాగుంది అని చెప్పడం తో చంద్రబాబు స్కెచ్ లు అన్ని పక్కగా అమలు అవుతున్నాయి అని భావించారు మేధావులు..అదేసమయంలో వైసీపిలో అందోళన నెలకొన్నా సరే పెద్దగా పట్టించుకోలేదు..అయితే తాజా ఘటనతో వైసీపికి గుండెల్లో రైళ్ళు పరిగేడుతున్నాయి..