“కన్నా” ఎంపికపై “పవన్ ఎఫెక్ట్” ఉందా...బీజేపీ “నయా స్కెచ్” ఇదే     2018-05-14   02:42:56  IST  Bhanu C

రాజకీయ ఎత్తులు పై ఎత్తులు ఏపీలో శరవేగంగా జరిగిపోతున్నాయి. ముఖ్యంగా కుల సమీకరణాలు మీద ప్రధాన పార్టీలు అన్ని దృష్టిసారించాయి. అందుకోసం తమ సిద్ధాంతాలను, నియమాలను కూడా పక్కనపెట్టి నాయకులకు పదవులు ఇస్తున్నాయి…కుల ప్రాతిపదికన బీజేపి ఏపీలో కొత్త నాటకానికి తెరలేపుతోంది.. తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ ఎంపికే దీనికి ప్రధాన ఉదాహరణ.

కన్నా ఎంపికపై బీజేపీలో అసంతృప్తులు చెలరేగాయి. అదే సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజు ఆ పదవి ఆశించి భంగపడ్డారు. ఆయనకు పార్టీ ఎన్నికల నిర్వాహణ కమిటీ కన్వీనర్‌ పదవి ఇచ్చింది. వీటిని ఉదాహరణగా చూసుకుంటే ప్రధానంగా బీజేపీ కాపు సామజిక వర్గంపై దృష్టిసారించినట్టు స్పష్టంగా అర్ధం అవుతోంది. ఏ పార్టీ ఎలా ఉన్నా.. బీజేపీ విషయానికి వస్తే పార్టీలో ఎక్కువ కాలం పనిచేసి, పార్టీ కోసం కష్టపడిన వారికే ఇటువంటి పదవులు దక్కేవి. కానీ దానికి భిన్నంగా ఈ మధ్యకాలంలో పార్టీలో చేరిన కన్నాకు ఈ పదవి ఇవ్వడం వెనుక పెద్ద రాజకీయమే బీజేపీ చేస్తున్నట్టు స్ప్రష్టంగా అర్ధం అవుతోంది.