కర్ణాటకలో మళ్ళీ కంగుతిన్న బీజేపీ !     2018-05-29   03:45:49  IST  Bhanu C

కర్ణాటకలో రాజకీయం అడ్డం తిరిగి పొగరెక్కి ఉన్న బీజీపీ పెద్దల అహం మొత్తం అణిచేసింది. అందుకే తమ దగ్గర ఉన్న డబ్బు వెదజల్లి ఎలా అయినా కర్ణాటకలో అధికారం చేజిక్కించుకోవాలనుకున్న నక్క జిత్తులను ఉన్నత న్యాయస్థానం కూడా అడ్డుకుంది. దీంతో కంగుతిన్న ఆ పార్టీ అధికారం చేపట్టిన నాలుగురోజుల్లోనే రాజీనామా చేసి ఇంట్లో కూర్చుంది. అంతటితో ఆగితే పర్వాలందు కానీ అహం నెత్తికెక్కిన ఆ పార్టీ పెద్దలు ఊరికే ఉంటారా..?

ఏదో ఒక రాజకీయం చేసి కర్ణాటక లో అలజడి సృష్టించాలని చూస్తున్నారు…జేడీఎస్ అధికారంలోకి వ‌స్తే రైతు రుణ‌మాఫీ చేస్తాన‌ని ఆ పార్టీ అధ్య‌క్షుడు కుమార స్వామి ఎన్నిక‌ల్లో హామీ ఇచ్చారు. అయితే, ఆయ‌న‌కు కేవ‌లం 38 సీట్లే వ‌చ్చాయి. దీంతో పార్టీ అధికారంలోకి వ‌చ్చే మెజారిటీకి చాలా దూరంలో ఉండిపోయింది. అయితే, బీజేపీని నిలువ‌రించే ప్ర‌య‌త్నంలో కాంగ్రెస్ ఆ పార్టీకి సంపూర్ణ మ‌ద్దతు ఇచ్చి కుమార‌స్వామిని ముఖ్యమంత్రిని చేసింది. సీఎం పోస్టు అయితే ద‌క్కింది గాని కుమార‌స్వామి భ‌విష్య‌త్తు మొత్తం కాంగ్రెస్ చేతుల్లో ఉండిపోయింది.