అన్యాయంగా ... అన్యాయం చేశారు ! ఈ పాపం ఆ పార్టీలదేనా ..?     2018-06-13   04:22:48  IST  Bhanu C

విభజన కష్టాలతో సతమతం అవుతున్న ఏపీ విషయంలో ఒక్కో పార్టీ ఒక్కో స్టాండ్ తీసుకుంటున్నాయి. ఏపీకి మావల్లే న్యాయం జరుగుతోంది అంటే కాదు కాదు మావల్లే అంటూ పార్టీలన్నీ క్రెడిట్ తమ ఖాతాల్లో వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే.. రాష్ట్రాన్ని మోసం చేసింది మీరంటే మీరే అంటూ ఒకదానిపై మరొక పార్టీ దుమ్మెత్తిపోసుకోవటం చూసిన తర్వాత అందరిలోనూ గందరగోళం మొదలైంది. మొత్తానికి పార్టీ ఏదైనా రాష్ట్రానికి అన్యాయం జరిగింది వాస్తవమే అన్న విషయం స్పష్టమైంది.

కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ ని విభజించింది. ఆ తరువాత విభజన హామీలను అమలు చేస్తామని ఇదే నరేంద్రమోడి, చంద్రబాబునాయుడు పదే పదే బహిరంగ వేదికలపై ప్రజలకు హామీలిచ్చిన సంగతి అందరూ అప్పట్లో చూసిందే. అప్పట్లో వాళ్ళిచ్చిన హామీలను నిజమని నమ్మి జనాలు వాళ్ళకు ఓట్లు వేశారు. ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ఇచ్చిన హామీలను గాలికొదిలేశారు.