బిగ్ బాస్ సీజన్ 2 హిట్టా.? ఫట్టా.? మొదటి సీజన్ తో పోలుస్తూ ఆడియన్స్ ఏమంటున్నారంటే?  

కంటెస్టెంట్స్ పైన కూడా సోషల్ మీడియా లో ట్రోల్ల్స్ అప్పుడే మొదలయ్యాయి. అమిత్ తివారి సూట్ కేసు, గీత మాధురి వాయిస్. ఇక దీప్తి సునైనా గురించి సెపరేట్ గా చెప్పనవసరం లేదు అనుకుంట.

ఒక్క తేజస్వి మడివాడ, బాబు గోగినేని మినహా మిగతావారందరందరికీ సెలబ్రిటీ హోదా ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే.. ఏమాత్రం ఆసక్తి పుట్టించలేని పర్సన్స్ వాళ్ళంతా. సో, కర్టెన్ రైజర్ షో అయితే హోస్టింగ్ పరంగా, కంటెస్టెంట్స్ పరంగా ఫెయిల్ అనే చెప్పాలి. మరి రానున్న సీజన్స్ ఏమైనా కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంటే ఒకే లేదంటే మాత్రం ఈ సీజన్ ఫ్లాప్ గా మిగిలిపోతుంది.

షో కి క్రేజ్ పెంచాలని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా సెలబ్రిటీస్ ని పిలిపించి ప్రయత్నంలో ఉన్నారు అధికారులు. అయితే మొదటి సీసన్ కూడా మొదట్లో ఆకట్టుకోలేకపోయింది. మెల్లమెల్లగా ఊపందుకున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సారి అలాగే జరుగుడ్డేమో చూడాలి!