Bigg Boss Telugu participants list

వివాదాస్పదం, సంచలనాత్మకం … బిగ్ బాస్ షో అంటే ఇలాంటి పదాలే గుర్తుకు వస్తాయి. ఇప్పటికే మీరు హిందీ బిగ్ బాస్ చూసుంటే ఈ ఆట ఎలా ఆడతారో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇది ఎలాంటి వివాదాలకి కేంద్రబిందువు అవుతుందో గుర్తుచేయనక్కరలేదు. ఎంత వివాదం ఉంటే అంత మజా, పార్టిసిపెంట్స్ ఎంత తిక్కగా ఉంటే అంత కిక్కు. ఎన్ని గొడవలు జరిగితే అంత టీఆర్పీ. గొడవలు – గ్లామర్ … అదే బిగ్ బాస్. అందుకే, తెలిసిన ముఖాలు గొడవలు పడితే ఆసక్తికరంగా ఉంటుందనే పాపులర్ సెలబ్రిటిలను బిగ్ బాస్ ఇంట్లోకి ఆహ్వానిస్తారు. మరి 70 రోజుల పాటు సాగే ఈ షో లో మనల్ని అలరించడానికి సిద్ధమవుతున్న సెలబ్రిటీలు ఎవరో చూద్దామా ?

రిపోర్ట్స్ ప్రకారం అయితే ఈ 14 పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతమంది ఉంటున్నారో ఈరోజు సాయంత్రం స్వయంగా ఎన్టీఆర్ మాటల్లో వినొచ్చు.

* సంపూర్నేష్ బాబు
* తేజస్వి మడివాడ
* హరి తేజ
* ధన్ రాజ్
* ముమైత్ ఖాన్
* కత్తి కార్తిక
* మహేష్ కత్తి
* ఆదర్శ్
* సమీర్
* మధు ప్రియ
* అర్చన
* కల్పన
* జ్యోతి
* శివ బాలాజీ